పెద్ద సినిమాల రిస్క్ వద్దు.. 'రియాలిటీ'తో సేఫ్ రికవరీ సాధ్యమేనా?
ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ హీరోలు నటనతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలోనూ తమ ప్రతిభను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
By: Madhu Reddy | 29 Oct 2026 11:02 AM ISTఇప్పుడు టాలీవుడ్లో యంగ్ హీరోలు నటనతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలోనూ తమ ప్రతిభను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అడవి శేషు ,నాని, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలు కూడా తమ సినిమాల విషయం లో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఈ జాబితాలో చేరారు. త్వరలో విడుదల కానున్న ‘రియాలిటీ’ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ఆ విశేషాలు చూద్దాం..
హీరోల దర్శకత్వ బాధ్యతలు.. ప్లస్సెస్ అండ్ మైనస్సెస్:
ఒక నటుడు తెరపై కనిపిస్తూనే, వెనుక ఉండి దర్శకత్వం పర్యవేక్షించడం కత్తి మీద సాము లాంటిదే. విశ్వక్ సేన్ వంటి కొందరు నటులు ఈ సాహసం చేసి సక్సెస్ కొంత సాధించారు. అయితే, నటనతో పాటు డైరెక్షన్ బాధ్యతలు కూడా మోయడం కొన్నిసార్లు సినిమా ఫలితంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. అడవిశేషు, నాని, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు కేవలం క్రియేటివ్ పనులకే పరిమితమవగా.. కిరణ్ అబ్బవరం మాత్రం ఏకంగా డైరెక్షన్లోకి అడుగుపెట్టడం విశేషం.
'రియాలిటీ' చిత్రంతో కిరణ్ రోల్:
గతంలో తన సినిమాలతో మంచి విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ‘రియాలిటీ’ సినిమా ద్వారా సరికొత్త సవాల్‌ను స్వీకరించారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు, లీడ్ రోల్ పోషిస్తూ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక నటుడిగా, దర్శకుడిగా ఆయన చేస్తున్న ఈ తొలి ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
క్రిస్మస్ బరిలో స్మార్ట్ బిజినెస్ వ్యూహం:
ఈ క్రిస్మస్ పండుగ సీజన్లో సీనియర్ హీరోలైన నాగార్జున 100 సినిమా, బాలకృష్ణ ‘దాదా’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఈ ఉద్ధండుల మధ్యే కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సినిమా కూడా విడుదలవుతుండటం గమనార్హం. ఇక పెద్ద సినిమాల జోరు ఉన్నప్పటికీ, ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. బిజినెస్ పరంగా చూస్తే రిస్క్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, దాదాపు రూ. 16 కోట్ల థియేట్రికల్ రైట్స్ కోసం నలుగురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం.
ఇక మొత్తంగా చూస్తే, నటుడిగా తన మార్కెట్‌ను స్థిరపరుచుకుంటూనే.. దర్శకుడిగా అడుగుపెడుతున్న కిరణ్ అబ్బవరం ప్రయత్నం విజయవంతమైతే ఆయన కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక క్రిస్మస్ పండగ కానుకగా రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వన్దర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
