Begin typing your search above and press return to search.

K ర్యాంప్ అటు ఇటైతే ఏం చేస్తావ్..?

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మరికొద్ది గంటల్లో అంటే శనివారం అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   17 Oct 2025 10:33 AM IST
K ర్యాంప్ అటు ఇటైతే ఏం చేస్తావ్..?
X

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మరికొద్ది గంటల్లో అంటే శనివారం అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది. పోటీగా రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైం లో ప్రతి చిత్ర యూనిట్ మంచి ప్రమోషన్స్ తో వస్తున్నారు. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమా మేకర్స్ ఆడియన్స్ అటెన్షన్ కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ సినిమా ట్రైలర్ ఇంపాక్ట్ కలిగేలా చేసింది. ఇక రిలీజ్ మరో 24 గంటలు ఉందనగా కూడా డైరెక్టర్ జైన్స్ నాని, హీరో కిరణ్ అబ్బవరం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో డైరెక్టర్, హీరో ఇద్దరు తిరుమల గుడిలో ఉన్నట్టు కనిపించారు. వాళ్ల వెనుక గోవింద నామాలు వినపడుతున్నాయి.

అంతా వారి చేతుల్లోనే ఉంది..

కొద్దిసేపట్లో మన సినిమా రిలీజ్ నీకేమనిపిస్తుంది నాని అని కిరణ్ అబ్బవరం అడిగితే.. నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా అన్నా అంటాడు. సినిమా అటు ఇటైతే పరిస్థితి ఏంటని అంటాడు కిరణ్. అన్నా గుడిలో ఎందుకలా మాట్లాడతావ్ అంటే ఇక్కడైనా నిజం మాట్లాడుదామని నాని అంటాడు కిరణ్. నాదేముందన్న బుచ్చిరెడ్డిపాలెం వెళ్లి కొన్నాళ్లు ఉండి వస్తా అంటాడు. వెళ్లి మళ్లీ తిరిగి రావేవో అనిపిస్తుందని కిరణ్ అబ్బవరం అంటాడు.

అలా అంటావేంటి అన్న అవకాశం ఇచ్చావ్.. ప్రయోజకుడిని చేయవా అంటే.. ప్రయోగమైతే చేశాం. ఇక అంతా వారి చేతుల్లోనే ఉంది. ఇక్కడ అందరు కోరుకునేది ఒకటే.. మా సినిమా బాగుండాలి.. మా సినిమా బాగుండాలి అని అంటూ రేలంగి మామయ్య డైలాగ్ చెబుతాడు కిరణ్ అబ్బవరం. సో రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ తో ఆడియన్స్ కి ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టీం.

దీపావళికి వచ్చి హిట్ కొట్టింది..

K ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ చూపించేలా ఉన్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ నిర్మించారు. కిరణ్ అబ్బవరం క తో సూపర్ హిట్ అందుకోగా నెక్స్ట్ వచ్చిన దిల్ రూబా నిరాశపరచింది. ఐతే కె ర్యాంప్ తో మళ్లీ హిట్ టార్గెట్ పెట్టుకుని వస్తున్నాడు. క దీపావళికి వచ్చి హిట్ కొట్టింది కాబట్టి కె ర్యాంప్ కూడా దీపావళికి వస్తుంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే కిరణ్ అబ్బవరం కు దీపావళి హిట్ సెంటిమెంట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

పోటీగా వచ్చే సినిమాలు ఎలా ఉన్నా తమ ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు కె ర్యాంప్ టీం. గుడిలో డైరెక్టర్ హీరో ఈ చిన్న వీడియో కూడా భలే అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ పై మాస్ ఆడియన్స్ ఆసక్తి కనిపిస్తుంది. ఐతే పోటీగా డ్యూడ్, మిత్ర మండలి, తెలుసు కదా సినిమాలు కూడా రేసులో ఉన్నాయి.