ఓనమ్ పాటతో హైప్ పెంచేట్టున్నారుగా!
ఓనమ్ పండుగ నేపథ్యంలో ఓ పాట ఉండనున్నట్టు మేకర్స్ రీసెంట్ గా ఓ మ్యూజిక్ సిట్టింగ్ వీడియోను రిలీజ్ చేయగా, ఇప్పుడు ఆ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 11:24 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా తిరుమల వెళ్లి తన కొడుకు కు హను అబ్బవరం అని నామకరణం చేసి, అందరికీ తన కొడుకు ముఖాన్ని చూపించిన కిరణ్ ప్రస్తుతం కే ర్యాంప్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా, సంప్రదాయంగా జరుపుకునే ఓనమ్ పండుగ నేపథ్యంలో ఓ పాట ఉండనున్నట్టు మేకర్స్ రీసెంట్ గా ఓ మ్యూజిక్ సిట్టింగ్ వీడియోను రిలీజ్ చేయగా, ఇప్పుడు ఆ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రోమో చూస్తుంటే ఈ పాటలో మలయాళ ట్రెడిషన్ ను కలర్‌ఫుల్ గా చూపిస్తూ తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. దర్శకనిర్మాతలు చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఈ సాంగ్ ను మంచి ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఓనమ్ ప్రోమో అదిరిపోగా, ఫుల్ సాంగ్ రేపు (ఆగస్ట్ 9న) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కానుంది.
మేకర్స్ చెప్పినట్టే ఈ పాట మంచి డ్యాన్స్ నంబర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న కే ర్యాంప్ సినిమా రిలీజ్ కానుండగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఆడియన్స్ ను నెక్ట్స్ లెవెల్ లో అలరిస్తుందని కిరణ్ అబ్బవరం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆఖరికి కే ర్యాంప్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
