Begin typing your search above and press return to search.

తెలుగు అబ్బాయి.. కేరళ కుట్టి లవ్ స్టోరీ సూపర్ హిట్టే..!

కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో జైన్స్ నాని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కె ర్యాంప్. హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ ఈ సినిమా నిర్మించారు.

By:  Ramesh Boddu   |   17 Oct 2025 9:41 AM IST
తెలుగు అబ్బాయి.. కేరళ కుట్టి లవ్ స్టోరీ సూపర్ హిట్టే..!
X

కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో జైన్స్ నాని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కె ర్యాంప్. హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ ఈ సినిమా నిర్మించారు. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. టైటిల్ కి తగినట్టుగానే సినిమా అంతా కూడా మాస్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంటుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కనకాల సినిమాకు సపోర్ట్ గా చేసిన కామెంట్ వైరల్ అయ్యింది.

రాజీవ్ కనకాల.. కేరళ అమ్మాయి సుమ కనకాలను లవ్..

కె ర్యాంప్ సినిమా తెలుగు అబ్బాయి కేరళ కుట్టిని లవ్ చేస్తే ఆ అమ్మాయితో ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అన్నది సినిమా కథ. కేరళ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా ఉంటుంది. ఐతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు అబ్బాయి, కేరళ కుట్టి లవ్ స్టోరీ సూపర్ హిట్టే. ఎందుకంటే రాజీవ్ కనకాల అనే అబ్బాయి కేరళ అమ్మాయి అయిన సుమ కనకాలను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అది సెపరేట్ స్టోరీ అని చెప్పారు.

కేవలం ఏదో ఈవెంట్ కి వచ్చామా డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్టు కాకుండా ఈవెంట్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అదే ఎనర్జీతో కనిపిస్తారు సుమ. ఇదే ఈవెంట్ లో సుమ గురిచి నిర్మాత రాజేష్ దండ చెబుతూ ఈవెంట్ కి 5 గంటలకు వచ్చారు ఇప్పుడు పదిన్నర అయ్యింది అయినా కూడా సుమ గారు అలానే ఎనర్జీగా ఉన్నారు. నేను చేసిన ఆరు సినిమాలకు ఆమె ఈవెంట్ హోస్ట్ చేశారు. సుమ గారు రాకుంటే ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేస్తా అని చెప్పారు రాజేష్ దండ.

ఎలాగైనా హిట్ కొట్టాలని కిరణ్..

ఇక కె ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా వస్తుంది. లాస్ట్ దీపావళికి కిరణ్ అబ్బవరం క సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. క ముందు వరకు కిరణ్ అబ్బవరం సినిమాల ఫలితాలు తేడా కొడుతుండటం వల్ల క తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో వచ్చాడు కిరణ్. క తర్వాత దిల్ రూబా మరో ఫ్లాప్ పడినా కె ర్యాంప్ మాత్రం ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నాడు కిరణ్ అబ్బవరం. కె ర్యాంప్ కేవలం తన సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కోసమే చేశానని చెప్పాడు కిరణ్ అబ్బవరం. పోటీగా తెలుసు కదా, డ్యూడ్ ఉన్నాయి. అయినా కూడా కె ర్యాంప్ మీద బజ్ బాగానే ఉంది.

మరి సుమ చెప్పినట్టుగానే తెలుగు అబ్బాయి, కేరళ కుట్టి లవ్ స్టోరీ మరోసారి సూపర్ హిట్ అనిపిస్తుందో లేదో చూడాలి. ఇదివరకు ఇలా కేరళ కుట్టితో వచ్చిన లవ్ స్టోరీస్ కూడా ఇంప్రెస్ చేశాయి. కె ర్యాంప్ మీద కిరణ్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాడు.