Begin typing your search above and press return to search.

సొంత బ్యాన‌ర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప‌నిలో హీరో

ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వారిలో టాలీవుడ్ యంగ్ టాలెంట్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా ఒక‌రు.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Sept 2025 11:00 PM IST
సొంత బ్యాన‌ర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప‌నిలో హీరో
X

ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వారిలో టాలీవుడ్ యంగ్ టాలెంట్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా ఒక‌రు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించారు. అయితే కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అత‌నికి సాలిడ్ స‌క్సెస్ ను అందించిన సినిమా మాత్రం క మూవీనే.

అక్టోబ‌ర్ లో కె ర్యాంప్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు..

క సినిమా స‌క్సెస్ కిర‌ణ్ కు చాలా రిలీఫ్ ను ఇచ్చింది. క సినిమా తో స‌క్సెస్ ను అందుకున్న కిర‌ణ్, దాని తర్వాత ప‌లు సినిమాల‌ను లైన్ లో పెట్టారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం కిర‌ణ్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కె ర్యాంప్ సినిమాను పూర్తి చేసిన కిర‌ణ్, ఆ సినిమాను అక్టోబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అది కాకుండా కిర‌ణ్ చేతిలో కొన్ని కొత్త ప్రాజెక్టులున్నాయి.

KA ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యాన‌ర్

ఆల్రెడీ చెన్నై ల‌వ్ స్టోరీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం చేతిలో మ‌రో 5 కొత్త సినిమాలుండ‌గా అవి ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే కిర‌ణ్ రీసెంట్ గా KA ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యాన‌ర్ ను స్టార్ట్ చేసి అందులో తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ అనే టైటిల్ తో ఓ చిన్న సినిమాను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.

నిర్మాత‌గా రెండో సినిమాను సెట్ చేసుకున్న కిర‌ణ్

ఆల్రెడీ మొద‌టి సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్న కిర‌ణ్ ఇప్పుడు నిర్మాత‌గా రెండో సినిమాను మొద‌లుపెట్టబోతున్నార‌ని తెలుస్తోంది. అయితే కిర‌ణ్ బ్యాన‌ర్ లో నిర్మించ‌బోతున్న రెండో సినిమాలో త‌నే హీరోగా ఓ కొత్త డైరెక్ట‌ర్ తో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. మొత్తానికి కిర‌ణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న నిర్మాణ సంస్థ‌లో వ‌రుస ప్రాజెక్టుల‌ను లైన్ లో పెడుతూ త‌న బ్యాన‌ర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప‌నిలో ఉన్నారు.