Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'కే- ర్యాంప్'.. ఎంత వసూలు చేయాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు కే- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 Oct 2025 4:34 PM IST
కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్.. ఎంత వసూలు చేయాలంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు కే- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. క సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అబ్బవరం.. ఒక్కసారిగా యమా క్రేజ్ సొంతం చేసుకున్నారు. క కలిసొచ్చిందనే ఉద్దేశంతో ఆ పదం ఇప్పుడు కే- ర్యాంప్ టైటిల్‌ లో పెట్టినట్లు ఉన్నారు.

జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్ర (6 ప్రాంతాలు)- రూ.3 కోట్లు

సీడెడ్ - రూ.1.25 కోట్లు

నైజాం - రూ.2 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - రూ.45 లక్షలు

మొత్తం- రూ.6.75 లక్షలు

అయితే కే- ర్యాంప్ థియేట్రికల్ బిజినెస్ అలా జరగ్గా.. బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ సాధించాలంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8 కోట్ల షేర్ వసూలు చేయాలట. అది చిన్న నంబర్ అనే చెప్పాలి. కిరణ్ అబ్బవరానికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే.. రూ.8 కోట్లు వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలవనుంది.

కాగా.. మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ అయింది. అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ హైప్ ఏర్పడింది. మేకర్స్ దాన్ని మంచిగా కాపాడుకుంటూ వస్తున్నారు. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. క్రేజీ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. అదిరిపోయే సాంగ్స్ ను ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ ను తెగ మెప్పిస్తున్నారు.

ఇప్పటికే టీజర్ తో అలరించగా.. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సినిమాపై మరింతగా బజ్ క్రియేట్ చేసేందుకు ట్రైలర్ ను కట్ చేసే పనిలో ఉన్నారు. త్వరలో ఎప్పుడు విడుదల చేయనున్నారో చెప్పనున్నారు. ఏదేమైనా మరో 10 రోజుల్లో రిలీజ్ కానున్న కే- ర్యాంప్ ఎంతటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.