హీరో అలా.. నిర్మాత ఇలా.. వై దిస్ కొలవెరి..?
ఐతే దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో తమిళ హీరోతో సినిమా చేసిన తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి రవి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By: Ramesh Boddu | 10 Oct 2025 10:02 AM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. క సినిమా ముందు వరకు అతని పని అయిపోయింది అనుకున్న వాళ్లకు క సినిమాతో షాక్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా తర్వాత నుంచి అతని సినిమాల కమిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. క తర్వాత దిల్ రూబా సినిమాతో వచ్చాడు కిరణ్ అబ్బవరం కానీ ఆ సినిమా పెద్దగా మెప్పించలేదు. ఇక లేటెస్ట్ గా కె ర్యాంప్ అంటూ ఒక క్రేజీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేశాడు. సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ నటించింది.
కిరణ్ క సినిమా టైంలోనే..
అక్టోబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కిరణ్ అబ్బవరం తమిళ హీరోల సినిమాలు తెలుగులో మంచి రిలీజ్ లు పడుతున్నాయి. కానీ తెలుగు హీరోలకు తమిళంలో అంత వెల్కమింగ్ ఉండదు అని అన్నాడు. కిరణ్ క సినిమా టైంలోనే ఈ విషయాన్ని చెప్పాడు.. మరోసారి కె ర్యాంప్ ప్రమోషన్స్ లో అది ప్రస్తావించాడు.
ఐతే దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో తమిళ హీరోతో సినిమా చేసిన తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి రవి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళంలో మన హీరోలకు తగిన ప్రాధాన్యత లేదని అంటున్నారు.. సినిమా బాగుంటే థియేటర్లు అవే దొరుకుతాయని అన్నారు.
సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా థియేటర్లు దొరకాలి..
కిరణ్ అబ్బవరం చెప్పింది కూడా అదే ముందు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా థియేటర్లు దొరకాలి కదా అని. ఎలాగు బాగాలేని సినిమాకు రెస్పాన్స్ ఉండదు. కనీసం బాగున్న సినిమా అయినా సరే ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నది పాయింట్.
కిరణ్ అబ్బవరం ఆవేదనని నిర్మాత రవిశంకర్ అర్థం చేసుకోవాల్సిందే అని కొందరి మాట. ఎందుకంటే మైత్రి నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ కూడా అదే రోజు వస్తుంది. ఐతే రవి శంకర్ ఈ డిస్కషన్ లోనే సినిమా మంచి టాక్ వస్తే మా థియేటర్లలో కూడా వేస్తామని అన్నారు. సో ఆయన వెర్షన్ సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా థియేటర్లు దొరుకుతాయని అంటున్నారు.
కిరణ్ అబ్బవరం కామెంట్స్.. మైత్రి రవి శంకర్ ఆన్సర్..
ప్రతి విషయంలో చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చే మైత్రి రవి రవి శంకర్.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ మీద ఇలా సినిమా బాగుంటే థియేటర్లు దొరుకుతాయని అనడం కరెక్ట్ రిప్లై కాదన్నది కొందరి కామెంట్. అతను సినిమా బాగుందా లేదా అన్నది కాదు.. అసలు తెలుగు హీరోలకు అక్కడ సరైన థియేటర్లు రావట్లేదని చెప్పాడు. కానీ మైత్రి రవి శంకర్ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడారు. ఏది ఏమైనా హీరో అలా అన్న కామెంట్ కి మరో నిర్మాత ఇలా రెస్పాండ్ అవ్వడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది.
