జనాలను గురి చూసి లాగుతున్న అబ్బవరం.. వ్వాటే స్ట్రాటజీ..
ప్రమోషన్స్.. ఏ సినిమాకు అయినా కచ్చితంగా అవసరమే. దీంతో మూవీ మేకర్స్ అంతా సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ పై దృష్టి పెడతారు
By: M Prashanth | 14 Oct 2025 12:38 PM ISTప్రమోషన్స్.. ఏ సినిమాకు అయినా కచ్చితంగా అవసరమే. దీంతో మూవీ మేకర్స్ అంతా సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ పై దృష్టి పెడతారు. స్పెషల్ ప్లాన్ తో ముందుకెళ్తారు. సినిమాలో నటించిన హీరో కూడా ఆ సమయంలో తన టైమ్ ను కేటాయిస్తారు. మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా తనదైన పాత్ర పోషిస్తారని చెప్పాలి.
కొత్త ఆలోచనలు
ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా అదే విధంగా సందడి చేస్తున్నారు. తన అప్ కమింగ్ మూవీ కే- ర్యాంప్ సినిమాను ఫుల్ జోష్ లో ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మూవీపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. అంతే కాదు.. వినూత్నంగా.. వెరైటీగా కే- ర్యాంప్ ను ప్రమోట్ చేస్తున్నారు.
సాధారణంగా సినిమాల ప్రమోషన్స్ టైమ్ లో హీరోలు వివిధ నగరాల్లో పర్యటిస్తారు. అక్కడ ఏదైనా ఫంక్షన్ హాల్ లేదా వివిధ హాల్స్ లో గ్రీట్ అండ్ మీట్ నిర్వహిస్తారు. మీడియా వాళ్లతో చిట్ చాట్ ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన విషయాలకు సమాధానమిస్తారు. అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటారు.
జనాల్లోకి వెళ్ళేలా..
కానీ ఇప్పుడు కిరణ్ అబ్బవరం.. వినూత్నంగా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఏ సిటీకి వెళ్లినా.. అక్కడ మీడియా ప్రతినిధులతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కలుస్తున్నారు. అక్కడ వాళ్లతో చిట్ చాట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో అలా చేసినట్లు లేదని చెప్పాలి. ఏదేమైనా కిరణ్ అబ్బవరం ఐడియా వేరు.
యూత్ ను అట్రాక్ట్ చేసేలా అబ్బవరం లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ను కలవడం కొత్త స్ట్రాటజీ అని చెప్పాలి. సినిమాను అందరిలా ప్రమోట్ చేయడం కామన్.. కానీ వినూత్నంగా ఆలోచిస్తే ఎప్పుడైనా కలిసి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ను కిరణ్ అబ్బవరం కలిసిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవిధంగా లోకల్ గా జనాల ఇంట్లోకి వెళుతున్నాడని చెప్పవచ్చు.
దీంతో ఇప్పుడు అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం స్ట్రాటజీ అదిరిపోయిందని చెబుతున్నారు. కొత్తగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. జనాలను గురి చూసి లాగుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈసారి ర్యాంప్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
