Begin typing your search above and press return to search.

కె ర్యాంప్.. క‌రెక్ట్ మీనింగ్ చెప్ప‌మంటున్న డైరెక్ట‌ర్

అయితే సోష‌ల్ మీడియాలో వాడే ప‌దానికి సంబంధించిన అర్థం చాలా త‌ప్పుగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ మేక‌ర్స్ కె ర్యాంప్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Oct 2025 6:42 PM IST
కె ర్యాంప్.. క‌రెక్ట్ మీనింగ్ చెప్ప‌మంటున్న డైరెక్ట‌ర్
X

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా సినిమా కె ర్యాంప్. జైన్స్ నాని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యాన‌ర్ల‌పై నిర్మాత రాజేష్ దండ, శివ బొమ్మ‌కు సంయుక్తంగా నిర్మించారు. యుక్తి త‌రేజా హీరోయిన్ గా న‌టించిన కె ర్యాంప్ సినిమా దీపావ‌ళి సంద‌ర్భంగా రిలీజై ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఏ సినిమాకైనా టైటిల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఎంతో ఆలోచించి మ‌రీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది డైరెక్ట‌ర్లు టైటిల్ తోనే త‌మ సినిమా ఎలాంటిదో ఆడియ‌న్స్ కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అందులో భాగంగానే కొన్ని టైటిల్స్ చాలా అర్థ‌వంతంగా ఉంటే, మ‌రికొన్ని అస‌లు అర్థం లేకుండా ఉంటాయి. ఇంకొన్ని టైటిల్స్ క్యాచీగా ఉంటాయి.

క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేసిన కిర‌ణ్

కిర‌ణ్ కూడా అలాంటి త‌న సినిమాకు అలాంటి క్యాచీ టైటిల్‌నే ఎంచుకున్నాడు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వాడే కె ర్యాంప్ అనే ప‌దాన్ని త‌న సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశాడు. అయితే సోష‌ల్ మీడియాలో వాడే ప‌దానికి సంబంధించిన అర్థం చాలా త‌ప్పుగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ మేక‌ర్స్ కె ర్యాంప్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

ఎలాంటి చెడు ఉద్దేశం లేదు

అందుకే కిర‌ణ్ సినిమా టైటిల్ ను అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విష‌యమై సినిమా ప్ర‌మోష‌న్స్ లో చాలా మంది చిత్ర యూనిట్ ను ప్ర‌శ్నించ‌గా, త‌మ సినిమా టైటిల్ వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేద‌ని, సినిమాలో హీరో పేరు కుమార్ అని, అత‌ని లైఫ్ లో ఎదుర‌య్యే ఇబ్బందుల్ని చూపించేందుకు ఆ టైటిల్ ను పెట్టామ‌ని, అంతే త‌ప్పించి ఆ టైటిల్ కు మ‌రో అర్థం లేద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజై ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న త‌ర్వాత చిత్ర యూనిట్ ర్యాంపేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పేరుతో స‌క్సెస్‌మీట్ ను నిర్వ‌హించ‌గా ఆ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటూ ప‌లువురు టాలీవుడ్ చిత్ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు హాజ‌ర‌య్యారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా డైరెక్ట‌ర్ వ‌శిష్ట మాట్లాడుతూ, త‌న‌కు ఓ విష‌యంలో క్లారిటీ కావాల‌ని, సినిమా పేరు కె ర్యాంప్ అని పెట్టారు. దానికి అర్థం కిర‌ణ్ ర్యాంప్ అన్నారు, రాజేష్ ర్యాంప్ అన్నారు, నాని ర్యాంప్ అన్నారు. కానీ అస‌లు కె ర్యాంప్ అంటే క‌రెక్ట్ మీనింగ్ ఏంటి? మీ అంద‌రూ మ‌న‌సులో అనుకున్న మీనింగ్ ఏంటో చెప్పాలని, ఇక్క‌డ సెన్సార్ లాంటివేమీ అడిగాడు. వెంట‌నే దానికి నిర్మాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం ర్యాంప్ అని స‌మాధాన‌మిచ్చారు. అయితే సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నప్ప‌టికీ కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ ఈ టైటిల్ ను త‌ప్పుగానే అనుకుంటున్నారు.