కిరణ్ అబ్బవరం K-ర్యాంప్.. BTS వీడియోతో మాస్ హంగామా
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దసరా బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమా K-ర్యాంప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
By: M Prashanth | 18 Sept 2025 2:36 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దసరా బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమా K-ర్యాంప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ మూవీని దసరా పండుగ సందర్భంగా మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక బిగ్ ఎంటర్టైనర్ గా తయారు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటలు సినిమాపై క్రేజ్ ను రెట్టింపు చేశాయి. కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ గా వచ్చిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద భారీగా బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన బిహైండ్ ది సీన్స్ వీడియో సినిమాకి మరింత జోష్ తెచ్చింది. షూటింగ్ స్పాట్ లో ఆఫ్ కెమెరాలో జరిగిన సరదా, క్రేజీ మూమెంట్స్ తో పాటు నటీనటుల ఫన్ యాక్టివిటీస్ ఆ వీడియోలో హైలైట్ అయ్యాయి.
ప్రత్యేకంగా హీరో కిరణ్ అబ్బవరం షూట్ లో చూపించిన ఎనర్జీ చూసి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ జైన్స్ నాని ఆ ఎనర్జీని కెమెరాలో బ్యూటిఫుల్ గా బంధించారు. పక్కా కామెడీ, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను డిజైన్ చేస్తున్నట్టు స్పష్టంగా ఈ BTS ఫుటేజ్ లో కనిపించింది. చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ కూడా మరో హైలైట్ అవుతోంది. ఇప్పటికే సాంగ్స్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ యుక్తి జోడి స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపించనుందని, వారి కెమిస్ట్రీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చిత్రబృందం నమ్ముతోంది. సరదా కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిక్స్ చేసి సినిమాను రెడీ చేస్తున్నారు. BTS వీడియోలో కూడా కిరణ్ కొత్త లుక్, టైమింగ్, మాస్ అటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.
కె-ర్యాంప్ సినిమాను రాజేష్ దండ, శివ బొమ్మక్ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ బలంగా ఉన్నాయని, ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. దసరా సీజన్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ ఫెస్టివల్ లాంటి రచ్చ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, కె-ర్యాంప్ BTS వీడియో తో సినిమా మీద హైప్ మరోసారి రెట్టింపు అయింది. ఇక విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
