ఇంద్రపుత్ర.. కిరణ్ అబ్బవరం ఈసారి సినిమాటిక్ యూనివర్స్
కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాతో ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తూ మార్కెట్ లో మరింత బలంగా మారుతున్నాడు.
By: M Prashanth | 10 Aug 2026 1:23 PM ISTకిరణ్ అబ్బవరం ప్రతి సినిమాతో ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తూ మార్కెట్ లో మరింత బలంగా మారుతున్నాడు. ఇక హీరోగా తన 15వ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ కి మేకర్స్ ఇంద్రపుత్ర అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కథలు ఎంచుకుంటున్న కిరణ్, ఈసారి ఏకంగా ఒక పాన్ ఇండియా సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు. మొదటి చాప్టర్ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ అనౌన్స్మెంట్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ధర్మం, అధర్మం మధ్య జరిగే ఒక ఇతిహాస యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగనుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ శ్రీకాంత్ పుప్పాల ఈ సినిమాను ఎంతో భారీ కాన్వాస్ మీద తెరకెక్కిస్తున్నాడు. మన పురాణాల్లోని ధర్మం అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని నేటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా ఈ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం.
రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ సినిమాతో కిరణ్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ రిజల్ట్ ఇచ్చిన బూస్ట్ తోనే ఇప్పుడు ఏకంగా ఇంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. కెరీర్ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడా తగ్గకుండా, ఫుల్ బౌన్స్ బ్యాక్ అవుతూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. లవ్ స్టోరీ ఇచ్చిన హిట్ ఫార్ములాతో ఇప్పుడు ఇంద్రపుత్ర లాంటి భారీ సినిమాను లైన్లో పెట్టడం చూస్తుంటే, కిరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో పక్కా క్లారిటీతో ఉన్నాడని అర్థమవుతుంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీర్తన్ కథను అందించగా, తన్వి ఎన్ దత్తా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలంటే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ టీమ్ ఉండాలి. అందుకే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నైలేష్ డియోరా, గిరీష్ జోహార్, అమిత్ భువన్ లాంటి వాళ్లను ఈ ప్రాజెక్ట్ కోసం సెట్ చేశారు.
నిర్మాణ విలువల పరంగా ఇంద్రపుత్ర ఒక విజువల్ వండర్ లా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన ఇంద్రపుత్ర టైటిల్ పోస్టర్ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి పడుతున్న పిడుగులు, కింద బండరాళ్లు పేలిపోతున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో ఇట్టే తెలుస్తోంది.
మధ్యలో ఒక పవర్ ఫుల్ ఆయుధం డిజైన్ ను ఇంద్రపుత్ర టైటిల్ కు లింక్ చేస్తూ చూపించిన తీరు బాగుంది. ఈ ఒక్క పోస్టర్ తోనే మూవీ థీమ్ ఏంటనేది ఆడియన్స్ కి ఒక చిన్న హింట్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే ఈ విజువల్ యాక్షన్ థ్రిల్లర్ ను 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంత పెద్ద సినిమాటిక్ యూనివర్స్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడానికి మేకింగ్ పరంగా చాలా సమయం తీసుకుంటున్నారు.
