'ఓజీ' వద్దు బ్రదర్.. యువ హీరో క్లారిటీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 15 Oct 2025 12:14 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఆయన.. కె-ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ కానుంది.
దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మ్యాటర్స్ తోపాటు ఇతర విషయాలపై మాట్లాడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు మరో వీడియో చక్కర్లు కొడుతోంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరానికి ఓ ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఓజీ మూవీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని అడగ్గా.. దానికి కిరణ్ స్పందించారు. "అది వద్దులేండి బ్రో. అలాంటి ప్రశ్నలు అడగకండి.. వద్దు అని ఎందుకు అంటున్నాంటే ఒక లాజిక్ చెబుతా. నేను నిజంగా ఆయన ఫ్యాన్" అని తెలిపారు.
"ఎక్కువ సార్లు చెబుతున్నా.. ఎక్కువ సార్లు దాని గురించి మాట్లాడుతున్నా.. ఉన్న సమస్య ఏంటంటే.. చాలా మంది న్యూట్రల్ ఆడియన్స్.. హీరోగా నేను ఏంటనేది చూస్తుంటారు.. కానీ మన ఓసారి ఒకసారి మాట్లాడే బదులు పది సార్లు రోల్ అవుతుంటే వేరేలా కన్వర్ట్ అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేశా. నేను ఫ్యాన్ అని అందరికీ తెలుసు" అని చెప్పారు.
"పదే పదే ఎక్కువ సార్లు చెబితే ఏమవుతుందంటే.. నా సినిమా రిలీజ్ ఉంది.. దాని కోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఓ ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. అలాంటి ప్రాపగాండా వద్దు. నాకంటూ సెపరేట్ గా సమ్ థింగ్ క్లియేట్ చేస్తా. సొంత గుర్తింపు కష్టపడి సొంతం చేసుకోవాలనుకుంటా" అని తెలిపారు.
అందుకే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడం లేదని, దయచేసి ఇబ్బంది పెట్టకండని కిరణ్ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కిరణ్ నిజాయితీని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పవర్ స్టార్ సినిమాలు గౌరవిస్తూ, తన సొంత గుర్తింపును కష్టపడి సంపాదించుకోవాలని అనుకున్న కిరణ్.. ఇన్స్పిరేషన్ అని చెబుతున్నారు. నిజాయతీతో ప్రేక్షకుల ముందుకు రావడం కిరణ్ ఉద్దేశంగా తెలుస్తుందని అంటున్నారు.
