కిరణ్, రహస్య: కొడుకుతో హ్యాపీ మూమెంట్స్
సెలబ్రిటీ కపుల్ పెళ్లి అయిన తరువాత వరుస ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
By: M Prashanth | 3 Oct 2025 8:35 PM ISTటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వ్యక్తిగత జీవితంలో కొత్త ఆనందంలో తేలుతున్నాడు. భార్య రహస్య గోరక్, పుట్టిన కొడుకు హను అబ్బవరం తో కలిసి డోపీ డానియల్ విశ్వాస్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో కిరణ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కిరణ్ రహస్య బంధం, చిన్నారి చిరునవ్వు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫొటోలు చూసిన వారు “ఇదే నిజమైన హ్యాపీ ఫ్యామిలీ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ కోటులో కిరణ్ స్టైలిష్‌గా కనిపించగా, రహస్య లైట్ బ్లూ డ్రెస్‌లో సింపుల్ లుక్ తో మెరిసింది. హను చిన్నారి ఆనందంగా నవ్వుతున్న ఫొటో అందరినీ ఆకర్షించింది. తల్లిదండ్రుల కౌగిలిలో చిరునవ్వు చిందిస్తున్న బాబు ఫొటో ఒక ప్రత్యేకతగా నిలిచింది.
సెలబ్రిటీ కపుల్ పెళ్లి అయిన తరువాత వరుస ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. పెళ్లి తర్వాత రహస్య ప్రెగ్నెంట్ కావడంతో ఎక్కువగా బయటకు రాకపోయినప్పటికీ, ఇప్పుడు చిన్నారితో కలిసి పబ్లిక్ ఈవెంట్ లో కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్ అయింది. అంతే కాదు, ఈవెంట్ లో జంట ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కిరణ్ రహస్య బంధం మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో వీరికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ‘రాజావారు రాణివారు’ సినిమాతో స్క్రీన్ పై జంటగా కనిపించిన ఈ ఇద్దరి కెమిస్ట్రీ అప్పటికే ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. తరువాత ఆ స్నేహం ప్రేమగా మారి, చివరకు గతేడాది ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ కుమారుడు హనుతో కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీగా మారి అందరి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు.
అలాగే, కిరణ్ కెరీర్ పరంగా కూడా బిజీగా ఉన్నాడు. ‘క’ సినిమా హిట్ సాధించగా, ‘దిల్ రూబా’ డిసప్పాయింట్ చేసింది. ప్రస్తుతం అతను ‘కే రాంప్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రహస్య కూడా ఓ సినిమాలో కనిపించనుంది. అంటే కుటుంబం, కెరీర్ రెండింటినీ సక్సెస్‌ఫుల్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఒకవైపు ఫ్యామిలీ బాండింగ్ ని చూపిస్తే, మరోవైపు కపుల్ కెమిస్ట్రీని మరోసారి హైలైట్ చేశాయి.
