Begin typing your search above and press return to search.

కింగ్డమ్ ఫ్రాంచైజీ.. మొత్తం మూడు భాగాలు, ఓటీటీలో కూడా

ఇప్పుడిప్పుడే గౌతమ్ బయటకి వచ్చి ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో సినమా రిసీవింగ్, అలాగే సినిమా ఫ్యూచర్ గురించి మాట్లాడారు.

By:  M Prashanth   |   3 Aug 2025 11:15 PM IST
కింగ్డమ్ ఫ్రాంచైజీ.. మొత్తం మూడు భాగాలు, ఓటీటీలో కూడా
X

గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించి కింగ్డమ్ జులై 31 థియేటర్లలో విడుదలైంది. జెర్సీ, మళ్లీ రావా చిత్రాలను తెరకెక్కింతి గౌతమ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి.. ప్రమోషన్స్ కు హాజరు కాలేదు. ఇప్పుడిప్పుడే గౌతమ్ బయటకి వచ్చి ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో సినమా రిసీవింగ్, అలాగే సినిమా ఫ్యూచర్ గురించి మాట్లాడారు.

కింగ్డమ్‌ ను తొలి నుంచి రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. సేతు అనే కొత్త పాత్రను పరిచయం చేయడంతో తొలి భాగం ముగుస్తుంది. ఆ పాత్ర మెయిన్ విలన్ అన్నపాత్రగా పరిచయం చేశారు. ఇర పార్ట్ 2లో విజయ్ దేవరకొండ- సేతు పోషించిన సూరి మధ్య సంఘర్షణ చుట్టూ కథ తిరుగుతుందని గౌతమ్ కన్ఫార్మ్ చేశారు. అయితే, నేరుగా సీక్వెల్‌ కాకుండా.. సేతు పాత్రను పరిచడంయ చేయడానికి ఓటీటీ వేదికగా ఓ చిన్న సినిమా చేయాలని భావిస్తున్నారు.

అయితే తొలి పార్ట్ లో అనేక సీన్స్ ఎడిట్ చేశారు. అవి ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేయాడానికి హెల్ప్ అవుతుంది. పార్ట్ 2 లో సేతు ప్రేక్షకుల ముందుకు రాకముందే.. ఆపాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కూడా దీని ఉద్దేశ్యం. సేతు పాత్రలో ఓ ప్రముఖ నటుడు నటిస్తున్నారని నిర్మాత నాగ వంశీ గతంలోనే చెప్పారు. కానీ అది ఎవరో రివీల్ చేయలేదు.

హీరో విజయ్ దేవరకొండ పార్ట్ 3 కోసం సైతం ముందస్తు చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది కార్యరూపం దాల్చితే, మూడవ పార్ట్ 1920ల నాటికి ప్రీక్వెల్‌గా ఉంటుంది. కానీ ఇవన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కింగ్డమ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక రెండో పార్ట్ OTT సినిమాగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత కింగ్డమ్ ఫ్రాంచైజీ పనులు ముందుకెళ్లే ఛాన్స్ లు ఉన్నాయి.