వీడియో : భాగ్యశ్రీని తక్కువ అంచనా వేసిన రౌడీస్టార్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'కింగ్డమ్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
By: Ramesh Palla | 30 July 2025 8:28 PM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'కింగ్డమ్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. నాగవంశీ ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించాడు. దాదాపు మూడు ఏళ్ల పాటు ఈ సినిమాపై వర్క్ చేసినట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. గత వారం.. రెండు వారాలుగా తెగ హడావిడి చేస్తున్న యూనిట్ సభ్యులు తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే తో పాటు యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, సినిమా గురించి, ఎలా ఉండబోతుంది, వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నారు.
శ్రీలంకలో కింగ్డమ్ షూటింగ్
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా విజయ్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. కింగ్డమ్ సినిమాపై తాము ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో ఆయన మాటల ద్వారా చెప్పుకొచ్చాడు. హీరోయిన్ భాగ్యశ్రీ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆమె యొక్క డెడికేషన్, పట్టుదలను చెప్పుకొచ్చాడు. శ్రీలంకలో మొదటి రోజు హాస్పిటల్ లో షూటింగ్ చేయాల్సి ఉంది. భాగ్యశ్రీతో నా సీన్ ఉంది. ఆమె ఆ సీన్‌లో చాలా పెద్ద సింహళ డైలాగ్ చెప్పాల్సి ఉంది. నాకు సింహళ లో చిన్న డైలాగ్ ఉంది. ఆమె డైలాగ్ చెప్పడానికి ఎలాగూ చాలా సమయం తీసుకుంటుంది కదా అని నేను ముందు రోజు నా డైలాగ్‌ను ప్రాక్టీస్ చేయలేదు. తీరా సెట్స్‌కి వెళ్లిన తర్వాత దర్శకుడు టేక్ అనగానే భాగ్యశ్రీ సింపుల్‌గా ఆ డైలాగ్ చెప్పేసింది.
భాగ్యశ్రీ గురించి విజయ్ దేవరకొండ
ఈమెకు తెలుగే సరిగా రాదు, సింహళలో ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు అనుకున్నాను. ఆమె డైలాగ్ చెప్పడానికి ఎలాగూ సమయం తీసుకుంటుంది, అప్పుడు నేను నా సింహళ డైలాగ్ నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ షాట్‌లోకి వెళ్లి టపటప అని డైలాగ్ చెప్పేసింది, ఒక సీన్‌కు వచ్చే ముందు ఎంతగా ఆమె ప్రిపేర్ అవుతుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని విజయ్ దేవరకొండ అన్నాడు. భాగ్యశ్రీని తక్కువ అంచనా వేశాను అని విజయ్ దేవరకొండ తన మాటల ద్వారా చెప్పుకొచ్చాడు. ఆమె నటిగా భవిష్యత్తులో టాప్ స్టార్‌గా నిలుస్తుందని కూడా విజయ్ దేవరకొండ, ఇతర యూనిట్ సభ్యులు కింగ్‌డమ్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
అనిరుధ్ సంగీతం ప్లస్ పాయింట్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి అనిరుధ్ ఇచ్చిన సంగీతం ప్రాణం పోసినట్లు ఉంటుందని నాగవంశీ అన్నాడు. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తీస్తున్నప్పటికీ మొదటి పార్ట్ క్లైమాక్స్ అర్థవంతంగా ఉంటుంది, మధ్యలో ఆపేసినట్లుగా అనిపించదని అన్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ నెలకొన్ని నేపథ్యంలో అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పాజిటివ్‌గా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి సినిమా ఎలా ఉంటుంది, రివ్యూలు ఎలా వస్తాయి, కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేది చూడాలి. భాగ్యశ్రీ బోర్సే గత చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు, కానీ ఈ సినిమాపై ఆమె చాలా నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఈమె నిలిచే అవకాశాలు ఉన్నాయి.
