Begin typing your search above and press return to search.

కింగ్‌డమ్‌.. సోషల్ మీడియా టాక్ ఏంటీ?

ఫస్ట్ షో నుంచే యూఎస్‌తో పాటు ఇండియాలోనూ సోషల్ మీడియాలో రివ్యూస్ రావడం మొదలయ్యింది.

By:  M Prashanth   |   31 July 2025 11:15 AM IST
కింగ్‌డమ్‌.. సోషల్ మీడియా టాక్ ఏంటీ?
X

కింగ్‌డమ్‌ సినిమా విడుదలకు ముందు భారీ హైప్‌ అందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా సాలీడ్‌గా వచ్చాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మళ్లీ బిగ్ హిట్ వస్తుందనే ఆశతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ సంగీతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా మీద మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. ఫస్ట్ షో నుంచే యూఎస్‌తో పాటు ఇండియాలోనూ సోషల్ మీడియాలో రివ్యూస్ రావడం మొదలయ్యింది.

సోషల్ మీడియా టాక్

విడుదలైన మొదటి రెండు షోలు పూర్తయ్యేసరికి, X (ట్విట్టర్), రెడిట్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రేక్షకుల అభిప్రాయాలు షేర్ అవుతూనే ఉన్నాయి. కింగ్‌డమ్‌ ఫస్ట్ హాఫ్‌ ఎంగేజింగ్‌గా ఉంది, ఇంటెన్స్ ఫీలింగ్ ఇస్తుంది. విజువల్స్, బీజీఎం బాగున్నాయి అనేలా అని కొందరు ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ నటనను మెచ్చుకున్నవారు ఎక్కువ. విజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే, వెంకీ విలన్‌గా అదరగొట్టాడు, అనిరుధ్ మ్యూజిక్ హైలైట్ అని సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు కనిపించాయి.

కానీ అదే సమయంలో, మరికొంతమంది కథపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి జెర్సీ స్థాయిలో ‘కింగ్‌డమ్’ అనుకున్న స్థాయికి వెళ్లలేదని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఫస్ట్ హాఫ్‌ బాగుంది కానీ సెకండ్ హాఫ్‌లో కథ స్లోగా నడిచింది, ఎమోషన్ మిస్సయింది, స్టోరీ డీప్త్ లేదు అంటూ పలువురు సోషల్ మీడియాలో రాసారు. ప్రత్యేకంగా కథలో మిస్టికల్ ఎలిమెంట్ తీసుకురావడం, టైటిల్ ఎక్స్‌ప్లనేషన్‌లో సిల్లీగా అనిపించిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఆ ఏమోషన్ మిస్సింగ్?

రెడ్డిట్ లాంటి ఫోరమ్స్‌లో మరింత స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ వచ్చింది. జెర్సీ లో ఉన్న ఎమోషన్, గ్రిప్పింగ్ నరేషన్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇక్కడ మిస్ అయ్యాయి.. అని అక్కడి యూజర్లు రాసారు. విజయ్, వెంకీ, అనిరుధ్‌ తమ పార్ట్‌లో పెర్ఫెక్ట్‌గా వర్క్ చేశారు. కానీ కథ అంచనాలు అందుకోలేదు, రాగిలే ట్రాక్ బాగుంది, కానీ స్క్రీన్ మీద అంతగా కనెక్ట్ కాలేదు..అనే అభిప్రాయాలు ఎక్కువగా కనిపించాయి.

అలాగే, స్టోరీ అంత స్పెషల్ అనిపించలేదు, సెకండ్ హాఫ్‌లో నరేషన్ డల్ అయింది అని మరికొందరు రాసారు. ఫస్ట్ హాఫ్ స్పీడ్ గానే సాగిన తర్వాత, సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది. ఎమోషనల్ కనెక్ట్ అస్సలు లేకపోయింది.. అని ఓ ఫ్యాన్ రివ్యూ చేశాడు. సినిమాకు డైరెక్టర్ గౌతమ్, విజువల్ స్టైల్, మ్యూజిక్ ప్రధాన ప్లస్ పాయింట్స్ అయితే, కథలో కిక్కిచ్చే ఎలిమెంట్ లేదని, కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా చూస్తే..

కింగ్ డమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ హంగులు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు మెచ్చినవారు ఉన్నారు. ఫస్ట్ హాఫ్‌కు ఎక్కువ పాజిటివ్ మేన్షన్స్, రెండో భాగానికి మాత్రం ఓ మోస్తరు టాక్. అయితే సినిమాకు పెద్దగా నెగటివ్ ట్రెండ్ లేదు. అలాగే మరీ బ్యాడ్ అనేలా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. ‘జెర్సీ’ స్థాయిలో మాత్రం ఎమోషన్ రాలేదన్న కామన్ పాయింట్ మాత్రం ఎక్కువగా కనిపించింది. మరి ఇలాంటి టాక్ ద్వారా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.