కింగ్‌డమ్ కథ ఫస్ట్ ఆ హీరోకు చెప్పారా.. నాగవంశీ క్లారిటీ
విజయ్ దేవరకొండ కెరీర్‌లో చాలా కీలకంగా మారబోతున్న ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా జూలై 31న విడుదలకు సిద్ధమైంది.
By: M Prashanth | 30 July 2025 5:19 PM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న సినిమా ‘కింగ్‌డమ్’ మూవీ. విజయ్ దేవరకొండ కెరీర్‌లో చాలా కీలకంగా మారబోతున్న ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా జూలై 31న విడుదలకు సిద్ధమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. మరోవైపు, సినిమా ప్రమోషన్లు కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. స్టార్ నటుల మీదే కాదు, కంటెంట్ మీద కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తి చూపించడంలో కింగ్‌డమ్ హైప్ సృష్టిస్తోంది.
కథ చరణ్‌కే రాసిందా?
మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఓ టాక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మొదటగా కింగ్‌డమ్ మూవీ స్టోరీని రామ్ చరణ్‌కి గౌతమ్ తిన్ననూరి చెప్పారని ప్రచారం జరిగింది. దీనిపై ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది. అసలు ఈ మూవీ కథ రామ్ చరణ్ కోసమే రాసారా? అప్పట్లో కథ నచ్చకపోవడంతో గౌతమ్, విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళారా? అంటూ అనేక ఊహాగానాలు సాగాయి. ఇండస్ట్రీలో కూడా రామ్ చరణ్‌తో గౌతమ్ తిన్ననూరి గతంలోనూ డిస్కషన్స్ జరిపారని వార్తలు వచ్చాయి. దీంతో నిజంగానే కింగ్‌డమ్ కథ మొదట చరణ్‌కే చెప్పారా? అనే డౌట్ స్పీడ్‌గా పెరిగిపోయింది.
నాగవంశీ నుంచి క్లారిటీ
అయితే, ఈ విషయంపై కింగ్‌డమ్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. "మొదటగా కింగ్‌డమ్ స్టోరీని రామ్ చరణ్‌కి చెప్పారనే వార్తల్లో వాస్తవం లేదు. అది కంప్లీట్‌గా వేరే కథ. చరణ్‌తో గౌతమ్ తిన్ననూరి కొన్ని రోజుల పాటు ఓ కొత్త కథపై చర్చలు జరిపారు. కానీ ఆ కథ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం కింగ్‌డమ్ కథకు చరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు" అంటూ నాగవంశీ వివరించారు. దీంతో ఎప్పటినుంచో అనుమానంగా ఉన్న పాయింట్‌కు క్లియర్ అయిపోయింది.
ఆ కథ రామ్ చరణ్‌తో వస్తుందా?
ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ వివరణతో రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చే ఛాన్స్ పై హైప్ పెరిగింది. గౌతమ్ ఆ కథను కూడా కష్టపడి సిద్ధం చేశాడట. చరణ్‌తోనే చేయాలని ప్రయత్నించినా, వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని టాక్. ఇకపోతే ఆ కథను చరణ్‌తోనే చేస్తాడా, లేక మరొక స్టార్ హీరోతో ప్లాన్ చేస్తాడా? అనే ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం కింగ్‌డమ్ విడుదలయ్యాక గౌతమ్ తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారికంగా ప్రకటన రానుంది. మొత్తానికి, కింగ్‌డమ్ కథ రామ్ చరణ్‌తో సంబంధం లేదని నాగవంశీ స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకులు మాత్రం గౌతమ్ చరణ్ కాంబో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కింగ్‌డమ్ రిలీజ్ హవా కొనసాగుతోంది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
