OTTలో కింగ్ డమ్ షాక్.. ఇది ఊహించలేదే..!
మరి దీని వెనక రీజన్స్ ఏంటో తెలియదు కానీ కింగ్డం ఓటీటీలో చూసిన ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
By: Ramesh Boddu | 27 Aug 2025 11:50 AM ISTవిజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్ డమ్. జూలై 31న రిలీజైన ఈ సినిమా మొదటి షో టాక్ యావరేజ్ అని వచ్చినా ఫైనల్ రన్ లో సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండకు ఒక హిట్ వచ్చింది అని ఫ్యాన్స్ సంబరపడే లోగా ఫైనల్ రిజల్ట్ చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కింగ్ డం సినిమా లో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఐతే ఈ సినిమా నేడు ఓటీటీలో రిలీజైంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కింగ్ డం సినిమాను భారీ రేటుకి డిజిటల్ రైట్స్ దక్కించుకుంది.
కింగ్ డమ్ లో ఆ సాంగ్..
ఐతే విజయ్ దేవరకొండ సినిమాను థియేటర్ లో చూసిన ఆడియన్స్ కి హృదయం లోపల సాంగ్ కనిపించలేదు. సినిమాకు అడ్డుగా వచ్చిందని ఆ సాంగ్ లేపేశామని నిర్మాత చెప్పారు. విజయ్, భాగ్య శ్రీ మధ్య వచ్చిన ఆ సాంగే సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. ఐతే ఓటీటీ లో అయినా కింగ్ డమ్ లో ఆ సాంగ్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఓటీటీ లో సినిమా చూసిన ఆడియన్స్ కి షాక్ తప్పలేదు. సినిమా ఓటీటీలో కూడా హృదయం లోపల సాంగ్ పెట్టలేదు.
మరి దీని వెనక రీజన్స్ ఏంటో తెలియదు కానీ కింగ్డం ఓటీటీలో చూసిన ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అసలు ఆ సాంగ్ వదలకపోవడం వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చని డిస్కస్ చేస్తున్నారు. కింగ్ డం సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఓటీటీ లో అయినా హృదయం లోపల సాంగ్ ఉంటుందని ఆశ పడగా అదిలేదు.
ఓటీటీ రిలీజ్ లో కూడా..
థియేట్రికల్ వెర్షన్ లోనే ఆ సాంగ్ లేనందుకు కొందరు ఆడియన్స్ హర్ట్ అయ్యారు. ఆ విషయం తెలిసినా కూడా సితార నాగ వంశీ కింగ్ డమ్ ఓటీటీ రిలీజ్ లో కూడా ఆ సాంగ్ ని పెట్టలేదు. మరి యూట్యూబ్ లో డిలీటెడ్ కంటెంట్ గా ఆ సాంగ్ ని ఏమైనా వదులుతారేమో చూడాలి. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా యాడ్ చేస్తారని రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటే.. థియేటర్ వెర్షన్ ని మాత్రమే ఓటీటీలో పెట్టి షాక్ ఇచ్చారు.
ఒకవేళ కింగ్ డమ్ సీక్వెల్ లో ఆ సాంగ్ ఏమైనా పెడతారా ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి ఓటీటీలో కింగ్ డం సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన డిజిటల్ లవర్స్ ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి.
