Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ దూకుడు లేదేంటి..?

యూఎస్ లో విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అతని మొదటి సినిమా పెళ్లిచూపులు సినిమా నుంచి అక్కడ విజయ్ కి ఫ్యాన్స్ ఉన్నారు.

By:  Ramesh Boddu   |   4 Aug 2025 10:00 PM IST
Vijay Deverakonda Kingdom Slows Down at Box Office
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా బాక్సాఫీస్ పై దూకుడు తగ్గించింది. సినిమా గురించి ఓ పక్క మేకర్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నా కూడా రియాలిటీ మాత్రం వేరేలా ఉందని అర్ధమవుతుంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా విషయంలో పైన హడావిడి తప్ప లోపల మ్యాటర్ వేరేలా ఉందని తెలుస్తుంది. యూఎస్ లో ప్రీమియర్స్, ఫస్ట్ డే దూకుడు చూపించిన కింగ్ డమ్ రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి డిమాండ్..

యూఎస్ లో విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అతని మొదటి సినిమా పెళ్లిచూపులు సినిమా నుంచి అక్కడ విజయ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఈమధ్య ఎక్కువగా విజయ్ దేవరకొండ సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. ఐతే కింగ్ డమ్ విషయంలో అంచనాలు బాగున్నాయి. జెర్సీ తీసి సర్ ప్రైజ్ చేసిన గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా అనేసరికి బజ్ బాగా వచ్చింది.

యూఎస్ లో కింగ్ డమ్ ప్రీమియర్స్, ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసింది. ఐతే ఆ తర్వాత సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది. మేకర్స్ మాత్రం రోజుకొక కలెక్షన్స్ పోస్టర్స్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తున్నారు. సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ మాత్రం ఎవరికీ తెలియట్లేదు.

అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్..

కింగ్ డమ్ సినిమాలో విజయ్ కి జతగా భాగ్య శ్రీ బోర్స్ నటించింది. ఈ సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కొంతమేరకు సపోర్ట్ చేసింది. ఐతే గౌతం తిన్ననూరి సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే మాత్రం సినిమాకు వచ్చిన ఈ బజ్ కి మంచి రీచ్ వచ్చేది. కానీ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో హై ఇచ్చి సెకండ్ హాఫ్ గురి తప్పేసరికి ఫ్యాన్స్ కు తప్ప కామన్ ఆడియన్స్ కింగ్ డమ్ పై అసంతృప్తిగా ఉన్నారు.

ఐతే విజయ్ సినిమాలకు ఇలా మిక్సెడ్ టాక్ రావడం కూడా ఈమధ్య జరగలేదు. ఆ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సితార ఎనెటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మించిన కింగ్ డం సినిమా ఫైనల్ రన్ లో సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.