కింగ్డమ్ బాక్సాఫీస్: ఏపీ తెలంగాణ మొదటిరోజు లెక్క ఎంత?
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన 'కింగ్డమ్' సినిమా నిన్న గురువారం థియేటర్లలో విడుదలైంది.
By: M Prashanth | 1 Aug 2025 11:10 AM ISTవిజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన 'కింగ్డమ్' సినిమా నిన్న గురువారం థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు భారీగా బజ్ ఉన్నప్పటికీ, సినిమా రిలీజైన తర్వాత టాక్ మిక్స్‌డ్‌గా వచ్చింది. ప్రేక్షకులు సినిమాటోగ్రఫీ, విజయ్ నటన, అనిరుధ్ మ్యూజిక్‌కి మంచి మార్కులు వేశారు. అయితే కథ కొత్తగా లేదనే కామెంట్లు వినిపించాయి. అయినప్పటికీ, బుకింగ్స్ మాత్రం ఊహించిన స్థాయిలో వచ్చాయి.
నైజాంలో సాలీడ్ ఓపెనింగ్
బాక్సాఫీస్ వసూళ్ల పరంగా 'కింగ్డమ్' సినిమా నైజాం ఏరియాలో బాగానే రాబట్టింది. మొదటి రోజే రూ.4.20 కోట్ల షేర్ రాబట్టి, విజయ్ దేవరకొండకు అక్కడ భారీ ఓపెనింగ్ తీసుకువచ్చింది. హైదరాబాద్‌తో పాటు మెజర్ సిటీల్లో హౌస్‌ఫుల్ షోలు నడవడం, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ గిరాకీ ఎక్కువగా ఉండటంతో కలెక్షన్స్ ను పెంచింది. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, నైజాం మార్కెట్‌లో ఈ స్థాయి ఓపెనింగ్ ఊహించినిదే. ముఖ్యంగా మాస్ ఆడియన్స్, యూత్ బాగా రెస్పాండ్ కావడం ఈ కేవలం మొదటి రోజు వసూళ్లను పెంచింది.
సీడెడ్, ఉత్తరాంధ్రలో కూడా బలమైన స్టార్ట్
సీడెడ్ ప్రాంతంలో కూడా 'కింగ్డమ్' తన హవా చూపించింది. మొదటి రోజే రూ.1.70 కోట్ల షేర్ సాధించింది. ఉత్తరాంధ్రలో మాత్రం మొదటి రోజు రూ.1.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ విజయ్ ఫ్యాన్స్ భారీగా థియేటర్లకు వచ్చారు. ముఖ్యంగా, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో మంచి బుకింగ్స్ రావడంతో బాక్సాఫీస్ కు బూస్ట్ ఇచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, సినిమా టాక్ సాధారణంగా ఉన్నా, విజయ్ క్రేజ్ కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది.
ఇతర ప్రాంతాల్లో కలెక్షన్ల ఊపు
మిగిలిన ఏరియాల్లోనూ 'కింగ్డమ్' బాగానే వసూళ్లు రాబట్టింది. గుంటూరు లో రూ.0.75 కోట్లు, ఈస్ట్ గోదావరి లో రూ.0.74 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.0.59 కోట్లు, వెస్ట్ గోదావరి లో రూ.0.44 కోట్లు, నెల్లూరు లో రూ.0.34 కోట్లు షేర్ వచ్చింది. ఒక్కో జిల్లాలోనూ ఫస్ట్ డే బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉండటం స్పెషల్. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ సినిమా చూడటానికి ముందుకు రావడం వల్లే కలెక్షన్లు డీసెంట్‌గా వచ్చాయని ట్రేడ్ టాక్.
టోటల్ ఏపీ, తెలంగాణ షేర్
'కింగ్డమ్' సినిమా తొలి రోజు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం రూ.9.92 కోట్ల షేర్ వసూలు చేసింది. GST ఎక్స్‌క్లూడ్ చేసి లెక్కిస్తే ఇది ట్రేడ్ వర్గాలను ఆకట్టుకునే ఫిగర్. విజయ్ దేవరకొండకు గత కొన్ని సినిమాల తరువాత ఇదే మంచి ఓపెనింగ్, ‘కింగ్‌డమ్’కి మంచి కమర్షియల్ స్టార్ట్ దక్కిందని చెప్పవచ్చు. ఇక ముందున్న రోజుల్లో వసూళ్లు ఎలా ఉంటాయనేది పూర్తిగా సినిమాకు వచ్చే జనాల టాక్ మీద ఆధారపడి ఉంటుంది.
ఏపీ తెలంగాణ ఏరియాల కలెక్షన్స్
నైజాం: రూ.4.20 కోట్లు
సీడెడ్: రూ.1.70 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.1.16 కోట్లు
గుంటూరు: రూ.0.75 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ.0.74 కోట్లు
కృష్ణా: రూ.0.59 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ.0.44 కోట్లు
నెల్లూరు: రూ.0.34 కోట్లు
మొత్తం ఏపీ - తెలంగాణ మొదటి రోజు షేర్: రూ.9.92 కోట్లు
