Begin typing your search above and press return to search.

సగం షూట్‌ అయినా ఇంకా అనౌన్స్‌ చేయరేం నాగ్‌ సర్‌?

గత సంవత్సరం 'కుబేరా', 'కూలీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఈ ఏడాది తన సినిమాను విడుదల చేసేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Ramesh Palla   |   14 July 2026 2:00 PM IST
సగం షూట్‌ అయినా ఇంకా అనౌన్స్‌ చేయరేం నాగ్‌ సర్‌?
X

గత సంవత్సరం 'కుబేరా', 'కూలీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఈ ఏడాది తన సినిమాను విడుదల చేసేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నాగార్జున కొత్త సినిమా అధికారికంగా ప్రకటన రాలేదు. హీరోగా నాగార్జున చేయబోతున్న 100వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ సైలెంట్‌గా వందవ సినిమా పనులు చేస్తున్నారు. ఇప్పటికే రా. కార్తీక్‌ దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లో ఫ్రొఫైల్‌ మెయింటెన్ చేస్తూ దర్శకుడు కార్తీక్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నాగార్జున సైతం సినిమాను ప్రకటించడం పై దృష్టి పెట్టకుండా షూటింగ్‌ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా షూటింగ్‌ సగం పూర్తి చేశారట.

నాగార్జున కొత్త సినిమా...

సాధారణంగా షూటింగ్‌ ప్రారంభంకు కొన్ని నెలల ముందే సినిమాను అనౌన్స్ చేసి పబ్లిసిటీ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ నాగ్‌ వందవ సినిమాకు మాత్రం షూటింగ్ సగం పూర్తి అయినా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కనీసం ఫ్యాన్స్‌ కి సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నాగార్జున వందవ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిందనే విషయం తెలుసు, అంతకు మించి సినిమా గురించి చిన్న అప్‌డేట్‌ కూడా రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు నాగార్జున 'లెనిన్‌' సినిమాపై దృష్టి పెట్టాడు. అఖిల్‌ హీరోగా నటించిన సినిమా కావడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్న కారణంగా నాగార్జున లెనిన్‌ కోసం చాలా సమయం కేటాయించాడట. అందుకే తన వందవ సినిమా షూటింగ్‌ కు తాత్కాలికంగా బ్రేకులు వేశాడనే వార్తలు వస్తున్నాయి.

నాగ్‌ 100 సినిమాపై క్లారిటీ...

వచ్చే నెలలో నాగార్జున పుట్టిన రోజు ఉంది. కనుక ఆ సమయంలో అయినా సినిమాను అధికారికంగా ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు నాగ్‌ 100 సినిమా కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాబోతున్న సినిమా కావడంతో కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు సినిమాను ప్రకటించలేదని, అలాగే దర్శకుడికి ఎలాంటి ఒత్తిడి లేకుండా నాగార్జున ప్లాన్‌ చేశాడని టాక్‌ వినిపిస్తుంది. ఒకసారి సినిమాను అధికారికంగా ప్రకటిస్తే అప్‌డేట్స్ అని, రిలీజ్‌ డేట్‌ అని, పాటలు అంటూ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తూ ఉంటారు. అందుకే సైలెంట్‌గా సినిమాను పూర్తి చేసి, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రమోషన్‌ ను చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది మేకర్స్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ కొత్త తరహా ప్లాన్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది చూడాలి.

అఖిల్‌ లెనిన్‌ సినిమా తర్వాత నాగ్‌ 100...

ఈ ఏడాదిలో నాగార్జున తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు అనధికారికంగా స్పందిస్తూ ఈ ఏడాది చివరి వరకు కచ్చితంగా నాగార్జున 100వ సినిమా విడుదల కాబోతుందని అంటున్నారు. షూటింగ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోంది. లెనిన్‌ సినిమా విడుదల అయ్యి మంచి స్పందన వచ్చింది కనుక నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది కనుక మరింత స్పీడ్‌గా వర్క్‌ చేస్తారని తెలుస్తోంది. నాగార్జున ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో నాగార్జున మూడు విభిన్నమైన ఏజ్‌ వేరియేషన్స్‌తో కనిపించబోతున్నాడట. అందుకోసం హాలీవుడ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. బర్త్‌డే కి సైతం నాగ్‌ 100వ అప్‌డేట్‌ రాకుంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక రా కార్తీక్‌ అనౌన్స్‌మెంట్‌కి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.