నాగ్ 100వ సినిమాలో స్పెషల్ లేడీ..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
By: Ramesh Palla | 28 Jan 2026 7:00 PM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. గత ఏడాది రెండు సినిమాలతో నాగ్ వచ్చినప్పటికీ అవి హీరోగా నటించిన సినిమాలు కాకపోవడంతో ఫ్యాన్స్ కొత్త సినిమా కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఖచ్చితంగా నాగార్జున 100వ సినిమా వస్తుందనే విశ్వాసంతో అభిమానులు ఉన్నారు. నాగార్జున 100వ సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కానీ ఇప్పటి వరకు సినిమా ఏ స్టేజ్ లో ఉంది అనే విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. అసలు సినిమాను ప్రారంభించిన విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు లీక్‌లు మాత్రం అందుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించబోతుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
నాగార్జున 100వ సినిమా అప్డేట్స్...
నాగార్జున, టబు కాంబో కి మంచి క్రేజ్ ఉంటుంది. అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు వీరి కాంబోను ఎంజాయ్ చేస్తారు. వీరు చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ కచ్చితంగా వీరి కాంబో ఇప్పటికీ వర్కౌట్ అయ్యేదే అన్నట్లుగా విశ్లేషకులు సైతం మాట్లాడుతూ ఉంటారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాగార్జున, టబు సన్నిహితులు, స్నేహితులు ఇంకా ఇంకా అనే ప్రచారం ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే సినిమా కోసం వీరిద్దరు చాలా కాలం తర్వాత కలవడం కన్ఫర్మ్ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాగార్జునకి 100వ సినిమా చాలా ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు. ఆ ప్రత్యేకమైన సినిమాలో నాగ్ కెరీర్‌లో చాలా స్పెషల్ లేడీ అయిన టబు నటించడం ద్వారా సినిమా మరింత ప్రత్యేకమైనదిగా మారుతుంది అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.
నాగార్జునకు జోడీగా టబు...
టబు టాలీవుడ్‌కి ఈ మధ్య కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ, ఇప్పటికీ స్టార్‌డంతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. హిందీలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టబు ఈ సినిమాలో నటించడం ద్వారా సినిమా క్రేజ్ పెరగడం మాత్రమే కాకుండా, బిజినెస్ కూడా పెరుగుతుంది అనేది నిర్మాతల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే నాగార్జున బెంచ్ మార్క్ సినిమాలో టబును నటింపజేసేందుకు గాను సిద్దం అయ్యారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ్ ఈ మధ్య కాలంలో చేయని విభిన్నమైన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. నాగార్జునకు జోడీగా ఇప్పటికే ఒక యంగ్ హీరోయిన్ ను ఎంపిక చేయడం జరిగిందని, ఆ హీరోయిన్ తో పాటు టబు కూడా కనిపించబోతుంది. నాగ్ సినిమాలో టబు ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
రా కార్తీక్ దర్శకత్వంలో నాగ్ 100వ సినిమా
నాగార్జునకు జోడీగా టబు నటిస్తేనే ఆ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కనుక సినిమాలో నాగార్జునకు ఏదో ఒక విధంగా జోడీగా టబు ను నటింపజేసే అవకాశాలు ఉన్నాయి. టబుకి ఉన్న స్టార్‌డం కారణంగా నాగ్ 100వ సినిమాకి తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ కావడం ఖాయం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్న ఈ సినిమాను ఈ సమ్మర్ చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగార్జున అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ను దర్శకుడు రా కార్తీక్ అందించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడిపై నమ్మకంతో నాగార్జున ఈ సినిమా కోసం చాలా చేస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున తన బెంచ్ మార్క్ సినిమాతో అయినా ఆ హిట్ ను అందుకుంటాడా అనేది చూడాలి.
