Begin typing your search above and press return to search.

ద‌స‌రా ధ‌మాకాలో ట‌బు సోలోగానా? జంట‌గానా?

దసరా పండగ కానుకగా ఈ చిత్రం నుంచి టబుకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ .. పోస్టర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

By:  Srikanth Kontham   |   17 Oct 2026 4:35 PM IST
ద‌స‌రా ధ‌మాకాలో ట‌బు సోలోగానా? జంట‌గానా?
X

కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం `కింగ్ 100`. ఈ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చే? ప్రతి చిన్న అప్‌డేట్ కోసం అక్కినేని అభిమానులు.. సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. దసరా పండగ కానుకగా ఈ చిత్రం నుంచి టబుకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ .. పోస్టర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

దసరా పండగ అంటేనే సినీ ప్రియులకు అప్‌డేట్ల పండుగ. అందులోనూ నాగార్జున 100వ సినిమా నుంచి రాబోయే స్పెషల్ అప్‌డేట్ అభిమానులకు అసలైన పండగ విందుగా మారనుంది. అయితే దసరా సందర్భంగా మేకర్స్ విడుదల చేయబోయే పోస్టర్ .. గ్లింప్స్‌లో టబు సోలోగా దర్శనమిస్తారా? లేదా నాగార్జునతో కలిసిన జంట పోస్టర్‌ను వదులుతారా? అన్నది ఆసక్తికర చర్చ. ఈ ఒక్క ప్రచార చిత్రంతో సినిమాపై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఐకానిక్ కాంబినేషన్ మ్యాజిక్

తెలుగు తెరపై నాగార్జున - టబు కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన మేజిక్. `నిన్నే పెళ్లాడుతా`, `ఆవిడా మా ఆవిడే` వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ తో ఇద్ద‌రి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దశాబ్దాల తర్వాత మళ్లీ ఇద్ద‌రు ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఆ కాంబినేషన్ రీయూనియన్‌పై భారీగా క్రేజ్ నెలకొంది. ఈ నేప‌థ్యంలో మేకర్స్ ఇద్ద‌రు కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేస్తే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి రెస్పాన్స్ రావడం ఖాయ.

సోలో లుక్ కే ఎక్కువ అవకాశాలా?

ఇది నాగార్జున 100వ చిత్రం కావడం.. కథలో టబు పాత్ర శక్తివంతంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుం డటంతో ముందుగా ఆమె పాత్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా పవర్‌ఫుల్ సోలో పోస్టర్ లేదా గ్లింప్స్‌ను డిజైన్ చేసి ఉండవచ్చని ఓ వర్గం టాక్. టబు లుక్.. క్యారెక్టరైజేషన్ పై ఆసక్తిని పెంచిన తర్వాత తదుపరి ప్రచార చిత్రాల్లో నాగా ర్జునతో ఉన్న జంట లుక్‌ను రివీల్ చేసే కాన్సెప్ట్ తోనూ మేకర్స్ ప్లాన్ చేసి ఉండొచ్చ‌ని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

క్రేజీ కాంబోతో గ్లోబల్ హైప్

టబు కేవ‌లం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా కాలేదు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో `NAG 100` చిత్రంలో ట‌బు భాగం కావడంతో సినిమా మార్కెట్ అండ్ క్రేజ్ మరింత విస్తరించింది. దసరా సందర్బంగా రాబోయే స్పెషల్ గ్లింప్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.