Begin typing your search above and press return to search.

‘కింగ్ 100’ కరెక్ట్ టైం కు వచ్చేనా?

ఎట్టకేలకు 'కింగ్‌ 100' సినిమాతో నాగార్జున తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, వరుసగా ఇతర సీనియర్‌ స్టార్స్ చేసినట్లుగా నాగ్‌ నుంచి సినిమాలు రాబోతున్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

By:  Ramesh Palla   |   30 Sept 2026 6:00 PM IST
‘కింగ్ 100’ కరెక్ట్ టైం కు వచ్చేనా?
X

కింగ్‌ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమా 'కింగ్‌ 100' పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆ మధ్య కుబేర సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కూలీ సినిమాలో పవర్‌ ఫుల్‌ విలన్‌గా నటించిన నాగార్జున కాస్త గ్యాప్‌ తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగార్జున 2024లో నా సామిరంగ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా నాగార్జున సాలిడ్‌ హిట్‌ అందుకుని చాలా కాలం అయింది. బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున నుంచి ఆ స్థాయి హిట్‌ కోసం, ఆ రేంజ్‌ మాస్ పాత్ర కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం కాస్త సైడ్‌ ట్రాక్‌ వెళ్లాడు అని అభిమానులు కాస్త అవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 'కింగ్‌ 100' సినిమాతో నాగార్జున తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, వరుసగా ఇతర సీనియర్‌ స్టార్స్ చేసినట్లుగా నాగ్‌ నుంచి సినిమాలు రాబోతున్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

నాగార్జున కింగ్‌ 100 సినిమా రిలీజ్‌...

నాగార్జున 'కింగ్‌ 100' సినిమా విషయంలో అభిమానుల్లో కాస్త గందరగోళం కనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్‌ 24న సినిమాను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. అధికారికంగా డేట్‌ సైతం ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ విషయమై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. నాగార్జున బర్త్‌డే సందర్భంగా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. దాంతో ఇంత తక్కువ సమయంలోనే సినిమా పూర్తి అవుతుందా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్‌లో కొందరు సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కాకపోవచ్చని, వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ కాంపౌండ్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదట.

నాగ చైతన్య, అఖిల్‌ గెస్ట్‌ రోల్స్‌...

సినిమాను ఇటీవల నాగార్జున బర్త్‌డే సందర్భంగా ప్రకటించినప్పటికీ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది. సినిమాను ప్రకటించే సమయంకు షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయ్యి ఉంటుంది. కనుక నవంబర్‌లోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసి డిసెంబర్‌ మొదటి వారం వరకు ఫస్ట్‌ కాపీ ని రెడీ చేసే విధంగా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలో కీలకమైన విలన్‌ పాత్రకు తమిళ నటుడు అశోక్‌ సెల్వన్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. తెలుగులో ఈయన పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్‌ కావడంతో సుపరిచితుడు అనడంలో సందేహం లేదు. అందుకే కింగ్‌ 100 సినిమాలో అశోక్‌ సెల్వన్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. నాగార్జున, అశోక్‌ సెల్వన్‌ కాంబో సీన్స్‌ చాలా బాగుంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రా. కార్తీక్‌ దర్శకత్వంలో కింగ్‌ 100 సినిమా...

ఈ సినిమాకు రా. కార్తిక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పై స్వయంగా ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు. ఇది బెంచ్‌ మార్క్‌ మూవీ కావడంతో నాగ చైతన్య, అఖిల్‌ సైతం ఈ సినిమాలో చిన్న గెస్ట్‌ రోల్‌ లో కనిపించే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. హీరోయిన్‌గా టబు నటిస్తూ ఉండగా కీలక పాత్రల్లో ఐశ్వర్య రాజేష్‌, సుష్మిత భట్‌, రవీంద్ర విజయ్‌లు కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. దసరా కానుకగా సినిమా నుంచి మొదటి సింగిల్‌ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక వైపు బిగ్‌బాస్‌ తో బిజీగా ఉన్నప్పటికీ నాగార్జున కింగ్‌ 100 సినిమాకు ఎక్కువ సమయం కేటాయించే వీలుగా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈ బెంచ్ మార్క్‌ మూవీ కచ్చితంగా అనుకున్న సమయంకు క్రిస్మస్ కానుకగా రావడం ఖాయం, మంచి ఫలితాన్ని సాధించడం ఖాయం అని యూనిట్‌ సభ్యులు బలంగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.