Begin typing your search above and press return to search.

బీచ్‌లో గ‌డ్డివాములో చిక్కుకున్న కిమ్

తెలుగు, హిందీ చిత్రసీమ‌లో క‌థానాయిక‌గా కెరీర్ జ‌ర్నీ సాగించిన కిమ్ గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంది.

By:  Sivaji Kontham   |   4 Aug 2025 8:17 PM IST
బీచ్‌లో గ‌డ్డివాములో చిక్కుకున్న కిమ్
X

`ఖ‌డ్గం` ఫేం కిమ్ శ‌ర్మ డేటింగ్ హిస్ట‌రీ ఎప్పుడూ ఉత్కంఠ పెంచుతూనే ఉంది. తెలుగు, హిందీ చిత్రసీమ‌లో క‌థానాయిక‌గా కెరీర్ జ‌ర్నీ సాగించిన కిమ్ గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంది. అంతేకాదు.. డేటింగ్ వ్య‌వ‌హారాల్లోను తన పేరు వినిపించ‌డం లేదు. టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ ఫేస్‌తో చాలా కాలంపాటు డేట్ చేసిన కిమ్ శ‌ర్మ, అటుపై కెన్యాకి చెందిన‌ డ్ర‌గ్ డాన్ అలీ పుంజానీని పెళ్లాడింది. కానీ అత‌డి నుంచి విడిపోయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో నిండా ప్రేమ‌లో మునిగింది. ఈ జంట షికార్లు నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. కానీ ఈ డేటింగ్ వ్య‌వ‌హారం కూడా ముగిసింది.

ప్ర‌స్తుతం ఒంట‌రి జీవితాన్ని న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తున్న కిమ్ బికినీ బీచ్ విహార యాత్ర‌ల‌తో మంట‌లు పెడుతోంది. ఇదిగో ఇక్క‌డ స‌ల‌స‌లా కాగుతున్న మండుటెండ‌లో బీచ్ లో విహ‌రిస్తున్న కిమ్ శ‌ర్మ‌, అలా గ‌డ్డివాము- టెంట్ లోకి నీడ కోసం జారుకుంది. ఈ కొత్త లుక్ చూశాక ``కిమ్ శ‌ర్మ బీట్స్ కిమ్ క‌ర్ధాషియ‌న్`` అంటూ ఒక అభిమాని ప్ర‌శంసించాడు. కిమ్ శ‌ర్మ చాలా హా*ట్ గా ఉందంటూ మ‌రొక అభిమాని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా కిమ్ టోన్డ్ లెగ్స్, యాబ్స్ గురించి యువ‌త‌రం నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

కిమ్ ధ‌రించిన బ్లాక్ బికినీ టోన్డ్ దేహ‌శిరుల్ని ఎంతో అందంగా ఎలివేట్ చేసింద‌ని ప్ర‌శంసిస్తున్నారు. కిమ్ మ‌ళ్లీ డేట్ కి రెడీగా ఉంది. బోయ్స్ మీలో ఎవ‌రైనా అర్హ‌త సాధించారా? అంటూ కొంద‌రు స‌ర‌దాగా స‌హ‌చ‌రుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. కిమ్ శ‌ర్మ నిరంత‌రం జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ, టోన్డ్ యాబ్స్ ని సాధించ‌డానికి చాలా ప్ర‌య‌త్నించింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ కొత్త లుక్ చూస్తుంటే తిరిగి క‌థానాయిక‌గా రీఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కిమ్ ఇక‌పై వేడెక్కించే వెబ్ సిరీస్ ల‌లో భాగం కానుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. అయితే త‌న త‌దుప‌రి గ‌మ్యం ఏమిట‌న్న‌ది కిమ్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.