ట్విస్టుకు రూ.కోటి.. కొత్త స్ట్రాటజీ సక్సెస్ అయితే..
సినిమా మీద నమ్మకం ఉంటే సరిపోదు.. ప్రేక్షకుల్లో హైప్ పెంచడం కూడా మెయినే. అందుకే సినిమా రిలీజ్ కు ముందు డైరెక్టర్లు, హీరోలు రకరకాల సవాళ్లు విసురుతుంటారు.
By: M Prashanth | 22 Oct 2026 10:11 AM ISTసినిమా మీద నమ్మకం ఉంటే సరిపోదు.. ప్రేక్షకుల్లో హైప్ పెంచడం కూడా మెయినే. అందుకే సినిమా రిలీజ్ కు ముందు డైరెక్టర్లు, హీరోలు రకరకాల సవాళ్లు విసురుతుంటారు. సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తామని కొందరు అంటుంటారు. మరికొందరు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ, 'కిల్లర్' డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాత్రం వీటికి భిన్నంగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటించిన 'కిల్లర్' అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీపై బజ్ పెంచేందుకు మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఆ ఈవెంట్ లో సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ ను గుర్తించి, ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించే వాట్సాప్ నంబర్ కు ఐదు నిమిషాల్లోపు సరైన సమాధానం పంపిన వారికి కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు.
సాధారణంగా సినిమా ప్రమోషన్లలో కథ గురించి కొన్ని విషయాలు చెప్పడం, హీరో రోల్ పరిచయం చేయడం, పాటలు, ట్రైలర్లతో ప్రేక్షకులను ఆకర్షించడం చూస్తుంటాం. కానీ, సినిమా కథలోని ట్విస్ట్ కనిపెట్టాలని ప్రేక్షకులకే సవాల్ విసరడం భిన్నమైన ప్రయత్నమే. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు కథలోని ట్విస్టులే మెయిన్ స్త్రెంత్. అలాంటి ఎలిమెంట్ ను ముందుగానే ప్రమోషన్స్ లోకి తీసుకురావడం ద్వారా సినిమాపై హైప్ పెంచే అవకాశం ఉంటుంది.
అయితే ట్విస్ట్ గురించి ఎక్కువగా చెప్పకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కూడా ముఖ్యమే. దర్శకుడు కేవలం మాటలతో సవాల్ చేయకుండా, కోటి రూపాయల చెక్ కూడా చూపించారు. దీంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో రూల్స్ ఏంటి, సరైన సమాధానాన్ని ఎలా నిర్ణయిస్తారు, ఒకరి కంటే ఎక్కువ మంది సరైన సమాధానం చెబితే బహుమతిని ఎలా అందిస్తారనే వివరాలు కూడా క్లియర్ గా తెలియాల్సి ఉంది.
అదే సినిమా ప్రమోషన్స్ లో మహిళల కోసం సూపర్ షీ పేరుతో మరో పోటీనీ నిర్వహిస్తున్నారు. రాత్రికి రాత్రే సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు వచ్చిన సమాధానాల్లో పది మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.1.40 లక్షలు అందించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. అంటే సినిమా ప్రచారాన్ని కేవలం పోస్టర్లు, ట్రైలర్లకే పరిమితం చేయకుండా, ప్రేక్షకులను నేరుగా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.
ఇక కోటి రూపాయల బహుమతి ప్రకటనతో ట్విస్ట్ ఏంటనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరగడం కామనే అయితే, ఆ ఆసక్తి థియేటర్ల వరకు వస్తుందా, వచ్చిన ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుందా అన్నదే అసలు విషయం. ఒకవేళ 'కిల్లర్' విషయంలో ఆ స్ట్రాటజీ మంచి రిజల్ట్స్ ఇస్తే, ఫ్యూచర్ లో మరికొన్ని సినిమాలు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు సినిమా గురించి వినడమే కాదు.. ఇన్వాల్వ్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొత్త స్ట్రాటజీ నిజంగా ఎంతవరకు పనిచేస్తుందో తేల్చేది మాత్రం మూవీ రిలీజ్ తర్వాత వచ్చే రెస్పాన్సే.
