Begin typing your search above and press return to search.

మళ్లీ బ్లడ్ బాత్ ఫెస్టివల్: 'కిల్' సీక్వెల్ క్రూయాల్టీ మ్యాడ్‌నెస్‌!

అయితే ఈ సీక్వెల్ విషయంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. మొదటి భాగాన్ని తన అద్భుతమైన విజన్‌తో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ ఈసారి ఈ ప్రాజెక్టులో భాగం కావడం లేదు.

By:  Sivaji Kontham   |   28 April 2026 9:00 AM IST
మళ్లీ బ్లడ్ బాత్ ఫెస్టివల్: కిల్ సీక్వెల్ క్రూయాల్టీ మ్యాడ్‌నెస్‌!
X

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత హింసాత్మకమైన రా అండ్ ర‌స్టిక్ యాక్షన్ చిత్రంగా రికార్డు సృష్టించిన `కిల్` చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. 2023లో సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో యాక్షన్ ప్రియుల్లో ఉత్సాహం మొదలైంది. `కిల్ 2` పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే మరింత క్రూరంగా.. ఊహించని స్థాయిలో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉండబోతోందని సమాచారం. ఈ ప్రకటనతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు `కిల్` సీక్వెల్ చర్చనీయాంశంగా మారింది.

ఈ సీక్వెల్‌లో కూడా కథానాయకుడిగా యంగ్ హీరో లక్ష్యనే కనిపించబోతున్నారు. మొదటి భాగంలో ఎన్ఎస్జీ (NSG) కమాండో అమృత్ రాథోడ్‌గా లక్ష్య పండించిన ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సీక్వెల్‌లో కూడా అదే పాత్రను ఆయన తిరిగి పోషించబోతుండటం చిత్రానికి అతిపెద్ద బలం. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న `కిల్ 2` కొత్త టైమ్‌లైన్‌తో మరింత భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. మొదటి భాగంలో రైలు ప్రయాణంలో జరిగిన భారీ యాక్షన్ తరహాలోనే.. ఇందులో కూడా నరాలు తెగే ఉత్కంఠను కలిగించే ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.

అయితే ఈ సీక్వెల్ విషయంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. మొదటి భాగాన్ని తన అద్భుతమైన విజన్‌తో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ ఈసారి ఈ ప్రాజెక్టులో భాగం కావడం లేదు. తన ఇతర ముందస్తు కమిట్‌మెంట్ల వల్ల ఆయన ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించలేకపోతున్నారు. సీక్వెల్‌ ఆసక్తిని పెంచుతున్నా.. మరోవైపు చిన్నపాటి ఆందోళన ఫ్యాన్స్ లో మొద‌లైంది. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సృష్టికర్త అయిన దర్శకుడు మారడం అనేది కచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే. కొత్త దర్శకుడు నిఖిల్ భట్ సృష్టించిన ఆ సిగ్నేచర్ స్టైల్ ను ఎంతవరకు పునరావృతం చేస్తారనేది చిక్కు ప్రశ్న.

సాధారణంగా ఒక యాక్షన్ సినిమా సక్సెస్ అనేది కేవలం కథ మీద మాత్రమే కాకుండా.. దర్శకుడి మేకింగ్ స్టైల్, కెమెరా యాంగిల్స్ .. ఎడిటింగ్ నాణ్య‌త‌పై ఆధారపడి ఉంటుంది. `కిల్` వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలకు మేకింగ్ స్టైల్ అనేది ఆత్మ వంటిది. కొత్త దర్శకుడు కేవలం యాక్షన్ సన్నివేశాలపై మాత్రమే దృష్టి పెట్టి.. కథలోని ఎమోషన్‌ను వదిలేస్తే ఈ సీక్వెల్ కేవలం ఒక `స్టంట్ షో`గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. నటుడు లక్ష్యలోని ఆ ఇంటెన్సిటీని మళ్లీ అదే స్థాయిలో రాబట్టడంలో కొత్త దర్శకుడి ప్రతిభపైనే ఈ చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది.

ప్రేక్షకుల్లో `కిల్ 2`పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా సీక్వెల్ ఏమాత్రం తేడా కొట్టినా అది మొత్తం ఫ్రాంఛైజీ గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొత్త దర్శకులు తాజా ఆలోచనలతో వచ్చి సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్తుంటారు. కానీ `కిల్` వంటి వినూత్న చిత్రాలకు ఒరిజినల్ మేకింగ్ స్టైల్ దెబ్బతినకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. అంచనాల భారాన్ని మోస్తూ... మేకర్స్ ఈ సీక్వెల్‌ను ఏ స్థాయిలో రక్తి కట్టిస్తారో వేచి చూడాలి. కిల్ చిత్రంలోని బ్ల‌డ్ బాథ్ ని ప్ర‌జ‌లు అంగీక‌రించ‌డం ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు డ‌బుల్ ధ‌మాకా బ్ల‌డ్ బాథ్ ని ప‌రిచ‌యం చేస్తార‌ట‌. అయితే ప్రేక్ష‌కులు అంగీక‌రించినంత‌వ‌ర‌కూ ఓకే కానీ..మ‌రీ అదుపు తిప్పితే మొద‌టికే మోసం వ‌స్తుంది. అందువ‌ల్ల కొత్త ద‌ర్శ‌కుడు దీనిని దృష్టిలో పెట్టుకుని క్రూర‌త్వం పాళ్లు జాగ్ర‌త్త‌గా క‌ల‌పాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.