Begin typing your search above and press return to search.

హీరోయిన్ తో సమస్యలు.. ఆ డబ్బులు టీటీడీకి విరాళంగా..

కికు యనమల హీరోగా నటించిన కికు చిరంజీవి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   25 Aug 2026 4:50 PM IST
హీరోయిన్ తో సమస్యలు.. ఆ డబ్బులు టీటీడీకి విరాళంగా..
X

కికు యనమల హీరోగా నటించిన కికు చిరంజీవి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుభ సాయి వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దీప్తి నడిమింటి హీరోయిన్ కాశిష్ ఖాన్ గురించి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

హీరోయిన్ వ్యవహార శైలి, షూటింగ్ టైమ్ లో పెట్టిన ఇబ్బందులను ఆమె ఓపెన్ గా చెప్పారు. అగ్రిమెంట్ లో ఉన్న డబ్బుల కోసం ప్రమోషన్స్ కు రాకుండా కాశిష్ చేసిన రచ్చ గురించి వివరించారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే కాశిష్ ఖాన్ కు లక్ష రూపాయలకు పైగా చెల్లించాలని అగ్రిమెంట్ లో ఉంది. కానీ ఆమె ఈవెంట్స్ కు రాకముందే ఆ డబ్బులు మొత్తం అడిగిందని నిర్మాత చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించినందుకు ఆమెకు ఆ డబ్బులు ఇచ్చేది లేదని ప్రెస్ మీట్ లోనే దీప్తి తేల్చి చెప్పారు. అలాగే బెదిరింపులకు కూడా పాల్పడినట్లు. తెలిపారు.

ఆ డబ్బును హీరోయిన్ కు ఇచ్చే బదులు ఒక మంచి పనికి ఉపయోగిస్తానని ఆమె స్టేజ్ మీద ప్రకటించారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కోసం నడుస్తున్న ట్రస్ట్ కు ఆ డబ్బును విరాళంగా ఇస్తానని మాట ఇచ్చారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. దీప్తి నడిమింటి శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.

ఆగస్టు 25వ తేదీన ఈ విరాళం ఇచ్చినట్లుగా టీటీడీ నుంచి ఆన్లైన్ డొనేషన్ రసీదు కూడా వచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈవెంట్ లో చెప్పిన వెంటనే ఇలా ఒక గొప్ప ఉద్దేశం ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు డబ్బులు పంపించడం పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోయిన్ కు ఇవ్వాల్సిన అమౌంట్ ను ఇలా ప్రాణదానం చేసే ట్రస్ట్ కు ఇవ్వడం సరైన నిర్ణయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇండస్ట్రీకి వచ్చే కొత్త నిర్మాతలు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి దశలోనూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటన్నింటినీ తట్టుకుని సినిమాను థియేటర్ వరకు తీసుకురావడం మామూలు విషయం కాదు. అందులోనూ మెయిన్ లీడ్ రోల్స్ నుంచి సరైన సపోర్ట్ లేకపోతే ఆ ఒత్తిడి మరింత పెరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. దీప్తి నడిమింటి లాంటి నిర్మాతలు ఆ ఇబ్బందులను ఎదుర్కొని తమ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లడం ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ సైన్ అని మిగతా నటీనటులు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.