Begin typing your search above and press return to search.

కిక్కెంచ‌డం కోసం పోటీ ప‌డుతోన్న భామ‌లు!

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా సాజిద్ న‌డియావాలా ద‌ర్శక‌త్వంలో `కిక్ `2 కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   19 Dec 2025 1:05 PM IST
కిక్కెంచ‌డం కోసం పోటీ ప‌డుతోన్న భామ‌లు!
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా సాజిద్ న‌డియావాలా ద‌ర్శక‌త్వంలో `కిక్ `2 కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం `కిక్` భారీ విజ‌యం సాధించడంతో రెండో భాగం కిక్ ను సాజిద్ మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. స‌ల్మాన్ తాజా సినిమా నుంచి రిలీవ్ అవ్వ‌గానే ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎంపిక‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొద‌టి భాగంలో జాక్వెలిన్ పెర్నాండేజ్ న‌టించింది. కానీ రెండ‌వ భాగానికి ఆమెని త‌ప్పించి కొత్త నాయిక ను తీసుకునే ప‌నిలో ఉన్నారు.

స‌ల్మాన్ ఖాన్ త‌ప్పించుకున్నాడు:

దీనిలో భాగంగా ప‌లువురి భామల్ని ప‌రిశీలించి చివ‌రిగా ఇద్ద‌రు లైన్ లో పెట్టారు. వాళ్లిద్ద‌రిలో ఒక‌ర్ని తీసుకుంటారు. దీంతో ఆ భామ‌లిద్ద‌రి మ‌ధ్య పోటీ నెల‌కొంది. కృతిస‌న‌న్, శ్ర‌ద్దాక‌పూర్ ల‌లో ఎవ‌రో ఒక‌ర్ని తీసుకోవాల‌ని సాజిద్ భావిస్తున్నాడుట‌. ఈ విష‌యం స‌ల్మాన్ ఖాన్ దృష్టికి తీసుకెళ్ల‌గా ఆయ‌న ఎవ‌రి పేరును స‌జ్జెస్ట్ చేయ‌లేదట‌. త‌న ఇష్ట ప్ర‌కార‌మే ఎంపిక చేయ‌మ‌ని ఆబాధ్య‌త డైరెక్ట‌ర్ మీద‌నే పెట్టేసాడట‌. దీంతో హీరోయిన్ ఎంపిక విష‌యంలో సాజిద్ కిందా మీదా అవుతున్నాడు.

సెల‌క్టివ్ భామ‌లే:

తాను రాసిన పాత్ర‌కు ఇద్ద‌రు ప‌ర్పెక్ట్ గా సూట‌వుతున్నార‌ని...ఎవ‌ర్ని ఎంపిక చేయాలో? తాను కూడా ఒక‌టి ప‌దిసార్లు పున‌రాచ‌న చేస్తున్నాడట‌. మరి ఆ ఛాన్స్ ఎవ‌రు అందుకుంటారో చూడాలి. కానీ కృతిస‌న‌న్, శ్ర‌ద్దా క‌పూర్ ఎవ‌రికి వారు అవ‌కాశం కోసం వ్య‌క్తిగ‌త ప్ర‌య‌త్నాలు చేస్తున్నారట‌. రెగ్యుల‌ర్ గా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ట‌చ్ లోకి వెళ్ల‌డం.. స‌ల్మాన్ ఖాన్ తో ఫోన్ కాంటాక్ట్ లో ఉండ‌టం వంటివి చేస్తున్నారట‌. మ‌రి లాబియింగ్ అన్న‌ది ఎవ‌రికి వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రు బాలీవుడ్ లో బిజీ నాయిక‌లే. స్టోరీల విష‌యంలో ఆచితూచి అడుగులు వేసే భామ‌లే.

ఫైన‌ల్ అయ్యేది ఎవ‌రు?

క‌థ‌ల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటారు. కృతిస‌న‌న్ ని త‌న‌లో ఆ క్వాలిటీనే జాతీయ ఉత్త‌మ న‌టిగా నిల‌బెట్టింది. పెర్పార్మ‌ర్ గా మంచి పేరుంది. శ్ర‌ద్దా క‌పూర్ కి మాత్రం క‌మ‌ర్శియ‌ల్ నాయిక‌గా గుర్తింపు ఉంది. బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా రాణించ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టి. `స్త్రీ `, `స్త్రీ 2` లాంటి వంద‌ల కోట్ల వ‌సూళ్లు చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ లు అన్నీ శ్ర‌ద్దాక‌పూర్ కి కలిసొచ్చేవి.` కిక్ 2` కాన్సెప్ట్ కూడా అంతే క‌మ‌ర్శియ‌ల్ గా ఉంటుంది. కాబ‌ట్టి శ్ర‌ద్దా క‌పూర్ ఎంపి క‌కు ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయి? అన్న‌ది ఓ వెర్ష‌న్. మ‌రోవైపు సాజిద్ న‌డియావాలా .. కృతిస‌న‌న్ ఎంపికకు ఆస‌క్తిగా ఉన్నాడు? అన్న ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది.