Begin typing your search above and press return to search.

స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడే ఫెయిల్యూర్!

ఏ డైరెక్ట‌ర్ అయినా ప్లాప్ ఇస్తే మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డానికి ఎన్నో విష‌యాలు ఆలోచించాల్సి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   30 Dec 2025 10:00 PM IST
స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడే ఫెయిల్యూర్!
X

ఏ డైరెక్ట‌ర్ అయినా ప్లాప్ ఇస్తే మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డానికి ఎన్నో విష‌యాలు ఆలోచించాల్సి ఉంటుంది. అదే స‌క్సెస్ ఇస్తే? అంత‌గా ఆలోచించే ప‌ని ఉండ‌దు. ఏ స్టార్ హీరో అయినా న‌మ్మ‌కంతో ధైర్యంగా ముంద‌డుగు వేస్తాడు. ఏ ఇండ‌స్ట్రీలో నైనా ఇలాంటి కాంబినేష‌న్స్ స‌హ‌జంగా క‌నిపిస్తుంటాయి. అదే న‌మ్మ‌కంతో కిచ్చా సుదీప్ విజ‌య్ కార్తీకేయ‌తో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేసాడు. విజ‌య్ తెరకెక్కించిన తొలి సినిమా `మ్యాక్స్` భారీ విజ‌యం సాధించింది. గ‌తేడాది రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 60 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన సినిమాలో సుదీప్ అర్జున్ మ‌హాక్ష‌య అనే స‌ర్కిల్ ఇనిస్పెక్ట‌ర్ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. ఆ పాత్ర‌లో మాస్ యాంగిల్ బాగా వ‌ర్కౌట్ అయింది. దీంతో సుదీప్ మ‌రో ఆలోచ‌న లేకుండా `మ్యాక్స్` అనంత‌రం `మార్క్` చిత్రం కూడా అత‌డితో చేసాడు. అదే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ఈసారి సుదీప్ ఎస్పీ పాత్ర పోషించాడు. స‌స్పెండెడ్ ఎస్పీ న‌గ‌రంలో జ‌రుగుతోన్న అక్ర‌మార్కుల‌పై ఎలాంటి ప్ర‌తీకార చ‌ర్య‌కు దిగాడు? అన్న‌ది హైలైట్ చేసారు. కిడ్నాపింగ్, డ్ర‌గ్ లీడ‌ర్, రాజ‌కీయం వంటి అంశాల‌ను ఆధారంగా చేసుకుని అల్లిన క‌థ ఇది.

స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ అయింది. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ప్పులుడ‌క‌లేదు. ఇదో రొటీన్ చిత్రంగా ప్రేక్ష‌కులు తేల్చేసారు. తొలి షోతోనే సినిమాకు నెగిటివ్ ప‌బ్లిక్ టాక్ వ‌చ్చేసింది. రివ్యూలు పాజిటివ్ గా రాలేదు. దీంతో స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడే సుదీప్ కి భారీ ఫెయిల్యూర్ కూడా ఇచ్చాడంటూ నెట్టింట నెటి జ‌నులు విమ‌ర్శల‌ వ‌ర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వైఫ‌ల్యంపై సుదీర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. `మ్యాక్స్` స‌క్సెస్ కంటే ముందు రిలీజ్ అయిన `క‌బ్జా`పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

కానీ ఆ సినిమా ఫ‌లితం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. `విక్రాంత్ రోనా`తో ఓ డిఫ‌రెంట్ అటెంప్ట్ చ‌సినా క‌లిసి రాలేదు. `మార్క్` స‌హా ఈ వైఫ‌ల్యాల నుంచి సుదీర్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడు? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం `బిల్లా రంగా భాషా` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో ద్విపాత్రాభిన‌యం పోషి స్తున్నాడు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.