సుదీప్ అవకాశాలన్నీ ఆయనే కొట్టేస్తున్నాడా?
విలన్ పాత్రలు కాకపోయినా కీలక పాత్రలతోనైనా తనదైన ముద్ర వేస్తాడని ఇండస్ట్రీలో గట్టిగానే చర్చ సాగింది. అతడు టాలీవుడ్ రావడానికి కారుకుడు రాజమౌళి అన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 10 Oct 2025 4:00 AM ISTటాలీవుడ్ లో కన్నడ నటుడు సుదీప్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `ఈగ`తో విలన్ గా లాంచ్ అయిన సుదీప్ అటు పై `యాక్షన్ 3డీ`, `బాహుబలి ది బిగినింగ్`,` సైరా నరసింహారెడ్డి` లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. దీంతో సుదీప్ టాలీవుడ్ కెరీర్ తిరుగుండదని భావించారంతా. స్టార్ హీరోలకు పర్పెక్ట్ విలన్ గా సెట్ అవుతాడనుకున్నారు. విలన్ పాత్రలు కాకపోయినా కీలక పాత్రలతోనైనా తనదైన ముద్ర వేస్తాడని ఇండస్ట్రీలో గట్టిగానే చర్చ సాగింది. అతడు టాలీవుడ్ రావడానికి కారుకుడు రాజమౌళి అన్న సంగతి తెలిసిందే.
ఛాన్సులు ఎందుకు కోల్పోతున్నట్లు:
దీంతో భవిష్యత్ ప్రాజెక్ట్ ల్లోనూ సుదీప్ భాగమవుతాడని అంచనా వేసారు. కానీ ఆ అంచనా తప్పింది. సుదీప్ టాలీవుడ్ లో అనుకున్న విధంగా సక్సస్ కాలేకపోయాడు. అతడి ట్యాలెంట్ శాండిల్ వుడ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే రేసులో సుదీప్ వెనుక బడటానికి మరో ప్రధాన కారణం ఉందంటూ ఓ వార్త వెలుగులోకి వస్తుంది. సుదీప్ దక్కించుకోవాల్సిన పాత్రలు మాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకుంటున్నాడే చర్చ జరుగుతోంది. `సలార్ సీజ్ ఫైర్` తో పృధ్వీరాజ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ పాత్రకు సుదీప్ సరితూగడా?
అటుపై రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా పాన్ ఇండియా చిత్రం `ఎస్ ఎస్ ఎంబీ 29` లో ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాని తెరకెక్కిస్తుంది రాజమౌళి. అతడే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఇక్కడే రాజమౌళి సుదీప్ ని కావాలనే పక్కన బెట్టారా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. సహజంగా ఏ సినిమాకైనా? పాత్రని బట్టి నటీనటుల్ని తీసుకుం టారు. జక్కన్న తీసుకున్న ఆ పాత్రకు సుదీప్ కూడా సరితూగడా? అన్న డౌట్ రెయిజ్ అవుతోంది.
కన్నడిగా మరో కన్నడిగిని ప్రోత్సహించలేదే:
అలాగే `సలార్` ని తెరకెక్కించింది కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సహజంగానే నీల్ కన్నడిగిలకు పెద్ద పీట వేస్తాడు అని తొలి నుంచి ఉన్నదే. కానీ సలార్ సినిమాలో సొంత పరిశ్రమకు చెందిన సుదీప్ ని పక్కన బెట్టి మాలీవుడ్ నటుడిని ఏ కారణంగా తెచ్చినట్లు అన్న డౌట్ రెయిజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో సుదీప్ కి రావాల్సిన అవకాశాలు కోల్పోతున్నాడా? అన్న చర్చ పరిశ్రమలో జరుగుతోంది.
