Begin typing your search above and press return to search.

అతడు చేసింది తప్పే... దర్శకుడికి స్టార్‌ హీరో మద్దతు!

కన్నడ స్టార్‌ ధ్రువ సర్జా హీరోగా రీష్మా నానైయా, సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో కిచ్చా సుదీప్‌, శిల్పా శెట్టి గెస్ట్‌ రోల్స్‌లో నటించిన 'కేడీ : ది డెవిల్‌' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Ramesh Palla   |   30 April 2026 7:00 PM IST
అతడు చేసింది తప్పే... దర్శకుడికి స్టార్‌ హీరో మద్దతు!
X

కన్నడ స్టార్‌ ధ్రువ సర్జా హీరోగా రీష్మా నానైయా, సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో కిచ్చా సుదీప్‌, శిల్పా శెట్టి గెస్ట్‌ రోల్స్‌లో నటించిన 'కేడీ : ది డెవిల్‌' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడంతో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. సంజయ్ దత్‌ వంటి స్టార్‌ ఉండటంతో బాలీవుడ్‌లో సినిమాకు మంచి ఓపెనింగ్‌ దక్కడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో కిచ్చా సుదీప్‌ నటించడం వల్ల కన్నడంలో మల్టీస్టారర్‌ అనే టాక్‌ వచ్చింది. దాంతో సినిమాకు భారీ అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అయినట్లుగా కన్నడ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాలోని ఒక పాట చుట్టూ ఏర్పడిన వివాదం వల్ల సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కిందని, తద్వారా సినిమాకు మరింత బజ్‌ పెరిగిందనే టాక్‌ వినిపిస్తోంది.

జాతీయ మహిళ కమీషన్‌ ముందు సంజయ్‌ దత్‌...

సర్సే నిన్నా సెరగా సర్సే... అంటూ సాగే పాటకు సంబంధించిన సాహిత్యం విషయంలో విమర్శలు వచ్చాయి. వివాదం ఏకంగా జాతీయ మహిళా కమీషన్‌ వరకు వెళ్లింది. ముఖ్యంగా హిందీ వర్షన్‌ విషయంలో తీవ్రమైన వివాదం చెలరేగింది. ఈ పాటలో నటించిన సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీలకు జాతీయ మహిళ కమీషన్‌ నోటీసులు ఇవ్వడం సైతం జరిగింది. అయితే సంజయ్ దత్‌ తాను షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో కన్నడంలో మాత్రమే పాట వినిపించారని, ఆ సమయంలో కన్నడంలో ఉన్న సాహిత్యం తనకు అర్థం కాలేదని, అందువల్లే నటించాను అని మహిళా కమిషన్ ముందు వివరణ ఇవ్వడం జరిగింది. తనకు తెలియకుండానే జరిగిన పొరపాటు అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పాడు. జాతీయ మహిళా కమీషన్‌ ముందు విచారణకు హాజరు అయిన సంజయ్ దత్‌ క్షమాపణ చెప్పడంతో పాటు 50 మంది గిరిజన పిల్లలకు విద్యను అందించేందుకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ...

ఇక ఈ పాట వివాదంపై స్టార్‌ హీరో, ఈ సినిమాలో కీలక గెస్ట్‌ రోల్‌లో నటించిన కిచ్చా సుదీప్‌ స్పందించాడు. దర్శకుడు ప్రేమ్‌ కు తన పూర్తి మద్దతు తెలియజేశాడు. ఇటీవల ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ... కేడీ పాట వివాదం బాధాకరం, తప్పు జరగలేదని నేను అనడం లేదు. అయితే అది కావాలని చేసిందని నేను అనుకోవడం లేదు. ఒక మనిషిని విమర్శించేప్పుడు అతడు గతంలో చేసిన పనిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దర్శకుడు ప్రేమ్‌ ఎన్నో గొప్ప పాటలను అందించాడు. తల్లి ప్రేమను వివరిస్తూ ఆయన ఇచ్చిన పాటలు ఎప్పటికీ మర్చిపోలేం. ఆ పాటలను మనం చాలా సార్లు విన్నాం. లూప్‌లో పెట్టుకుని మరీ తల్లి పాటలు వినేలా చేసిన దర్శకుడు ప్రేమ్‌ గురించి కన్నడ ప్రేక్షకులు సైతం ఇలాంటి విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని అన్నాడు.

కన్నడ మూవీ కేడీ : ది డెవిల్‌ పాటపై విమర్శలు..

కన్నడ తెలియని వారు, కన్నడ రాష్ట్రంకు బయట ఉన్న వారు ప్రేమ్‌ గురించి తెలియక పోవడంతో ఈ తప్పుకు విమర్శలు చేస్తున్నారు. అయితే కన్నడ ప్రేక్షకులకు ప్రేమ్‌ గురించి పూర్తిగా తెలుసు. ఆయన గతంలో చేసిన సేవ గురించి కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు పంచుకోవచ్చు. కానీ ఒక మనిషిని పూర్తిగా చిన్న చూపు చూస్తే విమర్శలు చేయడం అనేది ఏమాత్రం సరైన పద్ధతి కాదని సుదీప్ చెప్పుకొచ్చాడు. మనకు తెలిసిన మంచి వ్యక్తిపై మనం ఇంత కఠినంగా ఉండటం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రతి ఒక్క కన్నడ ప్రేక్షకుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని సుదీప్‌ అన్నాడు. ఇప్పటికే పాటపై వచ్చిన విమర్శల కారణంగా ఏ ప్లాట్‌ ఫాంపైనా పాట లేకుండా అన్ని చోట్ల నుంచి తొలగించారు. అంతే కాకుండా యూనిట్‌ మొత్తం క్షమాపణలు చెప్పారు. అయినా వివాదం కొనసాగుతూనే ఉంది. అందుకే హీరో సుదీప్‌ తన దర్శకుడికి మద్దతు తెలియజేశాడు.