Begin typing your search above and press return to search.

బిల్లా రంగ బాషా.. కిచ్చా సుదీప్ పవర్ ప్యాక్డ్ ట్రీట్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి.

By:  M Prashanth   |   2 Sept 2025 12:37 PM IST
బిల్లా రంగ బాషా.. కిచ్చా సుదీప్ పవర్ ప్యాక్డ్ ట్రీట్
X

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులపై అప్‌డేట్స్ వస్తుంటే, ఇప్పుడు మాత్రం బిగ్ ప్రాజెక్ట్ బిల్లా రంగ బాషా (BRB) నుంచి ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ అప్డేట్ హైప్‌ను రెట్టింపు చేసింది.


తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కిచ్చా సుదీప్ మాస్ లుక్ తో కేక పుట్టించాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తూ మేకర్స్ “ప్రతి సామ్రాజ్యం మోకరిల్లడానికి నిరాకరించే వ్యక్తిని భయపడుతుంది. తిరుగుబాటుదారుడిని చంపవచ్చు కానీ తిరుగుబాటుని కాదు” అనే లైన్ తో అదిరిపోయే ఎఫెక్ట్ క్రియేట్ చేశారు. ఈ ఒక్క డైలాగ్‌నే సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది.

ఇక పోస్టర్ విషయానికి వస్తే.. కిచ్చా సుదీప్ ఓ భారీ ఆయుధాన్ని పట్టుకుని, సముద్రం, పర్వతాలు, మంటల వాతావరణం మధ్య నిలబడి కనిపిస్తున్నాడు. అతని డ్రెస్, గాగుల్స్, వెనుకపైన మంటలలో తళుక్కుమన్న ఎరుపు చిహ్నం సినిమాకు మరో రేంజ్ లుక్ ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కిచ్చా కెరీర్ లోనే అత్యంత రగ్డ్ అండ్ రా లుక్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ తో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

సినిమా విషయానికి వస్తే.. బిల్లా రంగ బాషా ఒక యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికి దర్శకుడు అనూప్ బండారి హ్యాండిల్ చేస్తున్నారు. గతంలో రంగీతరంగ వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చూపించిన అనూప్, ఈసారి సుదీప్ కోసం ఓ మాస్ అండ్ మాగ్నమ్ ఓపస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ఇటీవలే పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న రుక్మిణి వసంత్ ఇందులో సుదీప్ సరసన కనిపించనున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సౌత్ తో పాటు నార్త్ ఇండియాలో కూడా సినిమాపై మంచి క్రేజ్ రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.