స్టార్ హీరోయిన్ బిడ్డకు పేరు పెట్టకపోవడానికి కారణం?
చాలా మంది ఇలా బిడ్డ పుట్టగానే అలా పేరు ప్రకటిస్తున్నారు. చాలా ముందే ఏం పేరు పెట్టాలో ఫిక్స్ అయిపోతున్నారు.
By: Sivaji Kontham | 8 Sept 2025 9:27 AM ISTచాలా మంది ఇలా బిడ్డ పుట్టగానే అలా పేరు ప్రకటిస్తున్నారు. చాలా ముందే ఏం పేరు పెట్టాలో ఫిక్స్ అయిపోతున్నారు. సెలబ్రిటీ ప్రపంచంలో ఇదేమీ అతీతం కాదు. అయితే గత జూలైలో కుమార్తె పుట్టినా ఇప్పటివరకూ కియరా అద్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంట పేరు పెట్టకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే తమ బిడ్డకు పేరు పెట్టకపోవడానికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకూ పరిపూర్ణత నిండిన సరైన పేరును కనుక్కోలేకపోయామని నిర్మాత వెల్లడించారు.
కుటుంబ సభ్యులు చాలా పేర్లను సూచించినా ఏవీ నచ్చడం లేదు. అందుకే ఏదో ఒక పేరు పెట్టడం ఇష్టం లేకే ఈ జంట వెయిట్ చేస్తోంది. అయితే కియరా తన బిడ్డకు మంచి పేరును సూచించాలని అభిమానులను కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ``ప్రస్తుతం మేం కొన్ని పేర్లను పరిశీలిస్తున్నాం. త్వరలో ఒకదాన్ని ఖరారు చేస్తాము`` అని సిద్దార్థ్ మల్హోత్రా అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, కియరాకు గేమ్ ఛేంజర్, వార్ 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్ బ్లో గా మారాయి. ఈ రెండు పరాజయాలను జీర్ణించుకోలేకపోతోంది. పెద్ద దర్శకులతో పెద్ద సినిమాలు చేస్తే అవి తీవ్రంగా నిరాశపరిచాయి. మరోవైపు సిద్ధార్థ్ కూడా తన కెరీర్ ని తిరిగి షేపప్ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలి పరమ్ సుందరి యావరేజ్ గా నిలవడంతో ఇప్పుడు అతడు కూడా సరైన బ్లాక్ బస్టర్ ని అందించాలని ప్రయత్నిస్తున్నాడట.
