Begin typing your search above and press return to search.

ఆ ఒక్క‌టి త‌ప్పా కియారా ఖాళీ!

క‌నీసం `వార్ 2` తోనైనా బ్యాలెన్స్ చేద్దామంటే? ఆ సినిమా కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. మ‌రి ఇప్పుడు కియారా చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? అంటే ఒకే ఒక్క చిత్రం క‌నిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   23 Sept 2025 11:00 PM IST
ఆ ఒక్క‌టి త‌ప్పా కియారా ఖాళీ!
X

`భూల్ భూల‌య్య‌2` త‌ర్వాత కియారా అద్వాణీ స‌క్సెస్ కి దూర‌మైంది. ఆ త‌ర్వాత న‌టించిన `జిగ్గుజియో` `గోవింద్ నామ్ మేరా`, `గేమ్ ఛేంజ‌ర్`, రీసెంట్ రిలీజ్ `వార్ 2` కూడా ప్లాప్ ఖాతాల్లోనే ప‌డ్డాయి. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `గేమ్ ఛేంజ‌ర్` పై చాలా ఆశ‌లు పెట్టుకుంది కానీ ప‌న‌వ్వలేదు. హిట్ తో టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌నుకుంది? కానీ వైఫ‌ల్యం మ‌ళ్లీ వెన‌క్కి నెట్టింది. క‌నీసం `వార్ 2` తోనైనా బ్యాలెన్స్ చేద్దామంటే? ఆ సినిమా కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. మ‌రి ఇప్పుడు కియారా చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? అంటే ఒకే ఒక్క చిత్రం క‌నిపిస్తోంది.

ఇంత‌కీ ఎవ‌రు హీరోయిన్:

అదే క‌న్న‌డ చిత్రం `టాక్సిక్`. య‌శ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో కియారా పాత్ర ఇంపార్టెన్స్ ఎంత‌? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఈ చిత్రంలో చాలా మంద తారాగ‌ణం ఉంది. నయ‌న‌తార‌, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ లాంటి అంద‌మైన భామ‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో య‌శ్ కి జోడీగా ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ఛాన్స్ న‌య‌న్ అందు కుందా? కియారాకి వ‌చ్చిందా? వీరిద్ద‌రు గాక మిగ‌తా వాళ్ల‌లో ఎవరైనా ఉన్నారా? అన్న లేక‌పోలేదు. మ‌రోవైపు టాక్సిక‌క్ పై ఏమంత గొప్పగా బ‌జ్ లేదు.

టాక్సిక్ పై బ‌జ్ ఎక్క‌డ‌?

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు రోటీన్ గా ఉన్నాయి. మేకింగ్ ప‌రంగానూ కొత్త‌గా అనిపించ‌లేద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కూ సంగం షూటింగ్ కూడా పూర్త‌వ్వ‌లేదు. రిలీజ్ కు చాలా స‌మ‌యం ప‌డు తుంది? అన్న‌ది నెగివిటీని తీసుకొస్తుంది. ఇలాంటి స‌న్నివేశం ఉన్న చిత్రంలో కియారా భాగ‌మవ్వ‌డం..బాలీవుడ్ లో కొత్త చిత్రాలు వేటికి క‌మిట్ అవ్వ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న క‌రంగా మారింది. అలాగే గ‌త ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో లేదు.

కొత్త సినిమాలెప్పుడు కియారా:

మ‌రి ఈ ఫేజ్ ని దాటి కియారా కొత్త అవ‌కాశాలు ఎలా అందుకుంటుంది? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం కియారా టాక్సిక్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు, కుటుంబానికే ప‌రిమిత‌మైంది. తాజాగా బెంగుళూరులో కొత్త షెడ్యూల్ అక్టోబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుండ‌టంతో హాజ‌రు కానుంది. ఇది లాంగ్ షెడ్యూల్. ఇందులో య‌శ్-కియారాల‌పై కొన్ని కాంబినేష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. మ‌రి ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసే లోపు కియారా కొత్త ఛాన్సులేవైనా అందుకుంటా? అన్న‌ది చూడాలి.