రెండోసారి తల్లి కాబోతున్న కియారా.. భర్త - కూతురితో వెకేషన్..
అందమైన జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జోడీ ప్రస్తుతం తమ కుమార్తెతో కలిసి వెకేషన్ మోడ్‌లో ఉన్నారు.
By: Sivaji Kontham | 11 Oct 2026 2:04 PM ISTఅందమైన జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జోడీ ప్రస్తుతం తమ కుమార్తెతో కలిసి వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఈ వెకేషన్ నుంచి సోషల్ మీడియాలోకి వచ్చిన ఫోటోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. కియరా రకరకాల మూడ్స్ లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి.
అక్టోబర్ 7న కియారా అద్వానీ తాను రెండోసారి ప్రెగ్నెంట్ అని తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాము - కూతురు సారాయా కలిసి చిన్న బేబీ బూటీస్‌ను పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ, ``మరోసారి ఆ దేవుడి అద్భుతమైన బహుమతి మాకు దక్కింది`` అంటూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ ప్రకటన తర్వాత కియరా తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో గడిపిన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
తాజాగా రివీల్ చేసిన ఫోటోలలో కియారా సూర్యరశ్మిలో బీచ్‌లో సేదరుతున్న దృశ్యాలు, ఇసుకపై కుటుంబ సభ్యుల పాదముద్రలు, అలాగే ఒక సరస్సు పక్కన పర్వతాల అందాలను ఆస్వాధిస్తున్న మధుర క్షణాలు ఉన్నాయి. తమ కూతురు సారాయా ముఖం కనిపించకుండా... బీచ్‌లో తన చిన్న పాదాలను చూపిస్తూ కొన్ని క్యూట్ ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో కియారా ముఖంలో కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ గ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫోటోలపై అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో `మామా గ్లో` అంటూ.. ఆమె మాతృత్వపు అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు సారాయా జన్మించింది. తొలి సంతానం తర్వాత వెనువెంటనే యష్ సరసన టాక్సిక్ లో నటించేందుకు కియరా చూపించిన ఉత్సాహం గురించి తెలిసిందే. మాతృత్వం తన వ్యక్తిగత జీవితంలో .. నిర్ణయాలలో ఎంతో మార్పు తెచ్చిందని.. తన కూతురికి మంచి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నానని కియారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇక కియరా- సిధ్ లవ్ స్టోరి గురించి తెలిసిందే. ఇంతకుముందు షేర్ షా చిత్రంలో జంటగా నటిస్తున్న సమయంలో ఈ జంట నడుమ ప్రేమ చిగురించింది. అది పెద్దల్ని ఒప్పించి పెళ్లాడే వరకూ వెళ్లింది. ఈ అందమైన జంట 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మొదటి పాప లాలనతో పాటు...ఇంటికి రానున్న కొత్త అతిథి కోసం కుటుంబం అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో - అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి.
