Begin typing your search above and press return to search.

అంబానీ ఈవెంట్లో కియారా కట్టుకున్న చీర ఖరీదు తెలిస్తే షాక్!

ముంబయిలోని ముకేష్ అంబానీ లగ్జరీ నివాసం 'ఆంటిలియా'లో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

By:  Madhu Reddy   |   15 Sept 2026 12:17 PM IST
అంబానీ ఈవెంట్లో కియారా కట్టుకున్న చీర ఖరీదు తెలిస్తే షాక్!
X

ముంబయిలోని ముకేష్ అంబానీ లగ్జరీ నివాసం 'ఆంటిలియా'లో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా 'ఆంటిలియా చా రాజా'ని దర్శించుకోవడానికి బాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట. కియారా ధరించిన సంప్రదాయ చీరకట్టు, రాయల్ లుక్ ఆంటిలియా వేడుకల్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆ ఈవెంట్ లో ఆమె కట్టుకున్న చీర ఖరీదు చుస్తే ఆశ్చర్యపోవలిసిందే.. ఆ విశేషాలు చూద్దాం.

ఆంటిలియాలో వినాయక చతుర్థి హంగామా:

సెప్టెంబర్ 13న వేద మంత్రోచ్ఛారణల మధ్య అంబానీ కుటుంబం గణపతిని ప్రతిష్టించింది. నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు ప్రత్యేక పూజలు నిర్వహించి సందడి చేశారు. ఇక కరీనా-సైఫ్, కత్రినా-విక్కీ, అలియా-రణ్‌బీర్ లాంటి ఉద్దండులంతా హాజరైనా.. సిద్ధార్థ్, కియారాల ఎంట్రీతో పండుగ వాతావరణం మరింత వర్ణరంజితంగా మారింది.

కియారా అద్వానీ రాయల్ పింక్ లుక్ :

కియారా అడ్వానీ 'దేవనాగ్రి' డిజైన్ చేసిన పౌడర్ పింక్ జార్జెట్ చీరలో మెరిసిపోయింది. చీరపై ముత్యాల పనితనం, జర్దోజీ బోర్డర్లు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. దీని ధర సుమారు దాదాపు రూ. 20 కోట్లు అని అంచనా. ఇక దానికి మ్యాచింగ్ డీప్ వి నెక్ బ్లౌజ్, రాయల్ లుక్ ఇచ్చే ఎమరాల్డ్ , పోల్కీ చౌకర్ సెట్‌తో పాటు అన్‌కట్ డైమండ్ గాజులు ధరించి దేవకన్యలా మెరిసిపోయింది. ఆమె ధరించిన గ్రాండ్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

సిద్ధార్థ్ మల్హోత్రా స్టైలిష్ ఎలిగెన్స్:

మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ జార్జెట్ కుర్తాలో కనిపించారు. రంగురంగుల థ్రెడ్ వర్క్, సీక్విన్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ కుర్తాకు మ్యాచింగ్ వైట్ ట్రౌజర్స్ ధరించి పక్కా సంప్రదాయ లుక్‌లో అదరగొట్టారు. ఇక ఈ జంట వేడుకలకు వచ్చిన క్షణాల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందరి దృష్టిని ఆకర్షించిన పిక్స్:

అంబానీ గ్రాండ్ ఫెస్టివల్‌లో ఎంతోమంది స్టార్స్ మెరిసినప్పటికీ, సిద్ధార్థ్-కియారాల రాయల్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇద్దరి మధ్య ఎదో జరుగుతుందని రూమర్స్ కి చెక్ పెట్టారు ..విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియా వచ్చే వార్తలకు ఈ ఫంక్షన్ తో చెక్ పెట్టేసారు. ఇక తమ స్టైలిష్ డ్రెస్సింగ్‌తో పండుగకు మరింత గ్లామర్ తీసుకువచ్చారని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంప్రదాయ పండుగల సమయంలో బాలీవుడ్ కపుల్స్ ఇచ్చే ఫ్యాషన్ గోల్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఈసారి అంబానీ నివాసంలో 'ఆంటిలియా చా రాజా' ఆశీస్సులు తీసుకుంటూ కియారా-సిద్ధార్థ్ జోడీ చూపించిన సంప్రదాయ మెరుపులు పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.