రాయల్ బ్లాక్‌లో 'టాక్సిక్' బ్యూటీ కియరా స్టన్నింగ్ లుక్
భారతీయ చిత్రసీమలో తనదైన గ్లామర్ - నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం `టాక్సిక్` ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటోంది.
By: Sivaji Kontham | 23 Aug 2026 5:20 PM ISTభారతీయ చిత్రసీమలో తనదైన గ్లామర్ - నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం `టాక్సిక్` ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఈ భామ మైండ్ బ్లాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా రూపొందించిన నల్లటి దుస్తుల్లో కియారా మెరిసిపోగా, సెలబ్రిటీ స్టైలిస్ట్ లక్ష్మి లెహర్ ఆమెను అత్యంత ఆకర్షణీయంగా స్టైల్ చేశారు. దీనికి తోడు రాజ్వాడా జ్యువెలరీ, అక్వాజురా హీల్స్, సరికొత్త హెయిర్ అండ్ మేకప్ శైలి ఆమె గ్లామరస్ లుక్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాయి.
కియారా ఈ ప్రమోషనల్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఫ్యాషన్ ప్రేమికులు- సినీ వర్గాల నుంచి భారీ స్పందన లభించింది. ప్రముఖ స్టైలిస్టులు అనైతా ష్రాఫ్ అదాజానియా, తాన్యా ఘావ్రిలతో పాటు వేలాది మంది నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. అభిమానులు క్వీన్-స్టన్నర్ అని అభివర్ణిస్తూ ఈ రాయల్ బ్లాక్ డ్రెస్‌లో కియారా లుక్ ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అయిందని హర్షం వ్యక్తం చేశారు.
భారీ యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్`పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అపారమైన అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్ల ప్రారంభంలోనే కియారా తన గ్లామరస్ అండ్ స్టైలిష్ అప్పియరెన్స్‌తో సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో తదుపరి రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్ల కోసం ధరించబోయే సరికొత్త అవుట్‌ఫిట్లపై ఫ్యాషన్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న కియారా అద్వానీ, `టాక్సిక్` మాత్రమే కాకుండా మరిన్ని భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో కీలక పాత్రలు పోషిస్తోంది. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ చిత్రం `డాన్ 3`లో కియారా నటించాల్సి ఉంది.
మరోవైపు కియారా అద్వానీ నేరుగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు సరసన `భరత్ అనే నేను`, రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ` ..శంకర్ భారీ చిత్రం `గేమ్ ఛేంజర్` లతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగులో కియరాకు ఉన్న ప్రత్యేక మార్కెట్ .. క్రేజ్ దృష్ట్యా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు తనను సంప్రదిస్తుండటంతో త్వరలోనే మరో స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌కు కియరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
