Begin typing your search above and press return to search.

యష్ 'టాక్సిక్'.. ఒక్క మాటతో కియారా ఫుల్ క్లారిటీ..

కన్నడ స్టార్ యష్ లీడ్ రోల్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

By:  M Prashanth   |   6 May 2026 8:00 PM IST
యష్ టాక్సిక్.. ఒక్క మాటతో కియారా ఫుల్ క్లారిటీ..
X

కన్నడ స్టార్ యష్ లీడ్ రోల్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా ఆ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తున్న కియారా అడ్వాణీ పాత్రకు సంబంధించిన బోల్డ్ సన్నివేశాలపై వచ్చిన వార్తలు హాట్ టాపిక్‌ గా మారాయి. అయితే ఆ ప్రచారానికి కియారా ఒక్క మాటతో చెక్ పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.

టాక్సిక్ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గోవా డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో 1950–1970 కాలం నాటి కథతో ఆ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందుతోంది. గ్లోబల్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల కియారా పాత్రకు సంబంధించిన కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలపై వివాదం చెలరేగింది. ఆ సీన్స్ ను తొలగించాలని కియారా మేకర్స్‌ను కోరిందని పలు కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఆ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి. దీంతో రూమర్లపై కియారా స్వయంగా రెస్పాండ్ అయ్యారు. ఫుల్ క్లారిటీ కూడా ఇస్తూ కౌంటర్ ఇచ్చారు.

తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో ఒక వార్త స్క్రీన్‌ షాట్‌ ను షేర్ చేసిన కియారా.. ఇదంతా నాన్సెన్స్ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. స్క్రిప్ట్ విషయంలో కానీ, తనపై షూట్ చేసిన సన్నివేశాల విషయంలో కానీ తాను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. అలాగే సీన్స్ తొలగించాలని కోరానన్న వార్తలు పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పారు.. దీంతో ఆ వివాదానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది.

ఇక సినిమాలో యష్, కియారాతోపాటు నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. నయనతార యష్‌ కు సోదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హుమా ఖురేషి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఆ సినిమాను జూన్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తర్వాత వాయిదా వేశారు.

ఇంటర్నషనల్ మార్కెట్‌ లో మరింత భారీగా విడుదల చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం రిలీజ్ ప్లాన్‌ ను మార్చినట్లు సమాచారం. ఇటీవల అమెరికాలో జరిగిన సినిమాకాన్ లో ఆ చిత్రానికి మంచి స్పందన రావడం కూడా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఆ వాయిదా బోల్డ్ సన్నివేశాల వివాదం వల్ల కాదని ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక యష్– కియారా కాంబినేషన్‌ లో వస్తున్న ఆ చిత్రం విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిగా మారింది.