మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!
తొలిసారి గర్భం దాల్చినప్పుడు హార్మోన్ మార్పులు, వాంతులు, శారీరక ఇబ్బందులతో ఎంతో ఇబ్బందిపడ్డానని కియారా అద్వానీ తెలిపారు. ఆ సమయంలో ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి తల్లులైన నటీమణులు తనకు అండగా నిలిచారని చెప్పారు. ప్రసవానంతరం సినిమాల్లోకి రీఎంట్రీ, కుటుంబం-కెరీర్ బ్యాలెన్స్‌పై ఆలియాతో చర్చించినట్లు వెల్లడించారు.
By: Srikanth Kontham | 12 Nov 2026 4:00 PM ISTబాలీవుడ్‌లో కియారా అద్వానీ జర్నీ దేదీప్యమానంగా సాగిపోతుంది. ఓవైపు నటిగా బిజీగా ఉంటూనే? కుటుంబ బాధ్యతలు అంతే విధిగా నిర్వర్తిస్తుంది. అమ్మగా సైతం ప్రమోషన్ రావడంతో? ఆ మాతృత్వపు మధిరిమలను ఆస్వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా గర్భదారణ సమయం నుంచి ప్రసవానంతరం దశ వరకు కియారా ఎదుర్కొన్న భావోద్వేగ మార్పుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఎదురయ్యే హార్మోన్ మార్పులు, వాంతులు, శారీరక ఇబ్బందుల వల్ల ఎంతగానో ఇబ్బంది పడ్డానని కియారా గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా తొలి మూడు నెలలు ఎవరికీ చెప్పలేక మనసులోని భావాలను పంచుకోవడానికి ఓ సరైన వేదిక కోసం వెతికానని తెలిపారు. ఆ సమయంలో తోటి నటీమణులు, తల్లులైన అలియా భట్, కత్రినా కైఫ్, పాత్ర లేఖలతో నిరంతరం టచ్‌లో ఉండి ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నామన్నారు. ఏ పరిశ్రమలోనైనా మహిళలను మహిళలే బాగా అర్థం చేసుకోగలరని కియారా అభిప్రాయపడ్డారు. ప్రసవానంతరం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఎలా? కెరీర్‌ను, కుటుంబాన్ని ఒకే సమయంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి? అనే విషయాలపై అలియా భట్‌తో ప్రత్యేకంగా చర్చించినట్లు కియారా తెలిపారు.
ఒక వైపు కుటుంబం.. మరోవైపు వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం కియారా రెండవ సారి గర్బం దాల్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో మరో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలో తోటి హీరోయిన్ల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన బాండింగ్ ఉండటం తనకెంతో మానసిక ఊరటనిచ్చిందన్నారు. తొలి సంతానం పుట్టిన తర్వాత ఎదురైన ఒంటరితనాన్ని అధిగమించడానికి ఫ్రెండ్స్ గ్రూప్ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచారని తెలిపారు. షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా తల్లులుగా తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారనే అంశాలపై తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.
ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది `టాక్సిక్` తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో కొత్త సినిమాలేవి కమిట్ అవ్వలేదు. ప్రసవం అనంతరమే మళ్లీ కొత్త ప్రాజెక్ట్ లకు ఒకే చెప్పే అవకాశం ఉంది. మరి తెలుగు సినిమాల విషయంలో కియారా పాజిటివ్ గా ఉందా? లేదా? అన్నది తెలియాలి. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. అందులో `భరత్ అనే నేను` మంచి విజయం సాధించగా మరో సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో తదుపరి టాలీవుడ్ సినిమాల విషయంలో అమ్మడి నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్నది తెలియాలి.
