Begin typing your search above and press return to search.

పవర్ సూట్ లుక్‌లో కియారా అద్వానీ.. స్టైల్‌కు కొత్త డెఫినిషన్!

కాన్ఫిడెంట్ లుక్‌తో, ఎలిగెంట్ స్టైల్‌తో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   10 Sept 2026 12:40 PM IST
పవర్ సూట్ లుక్‌లో కియారా అద్వానీ.. స్టైల్‌కు కొత్త డెఫినిషన్!
X

బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు తన నటన, అందంతో ఊపేస్తున్న అగ్ర నటి కియారా అద్వానీ, తాజాగా పోస్ట్ చేసిన పవర్ సూట్ పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామరస్ డ్రెస్సుల్లోనే కాకుండా రాయల్ కార్పొరేట్ లుక్‌లో కూడా తాను బాస్‌లా మెరిసిపోగలనో నిరూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇప్పుడు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కాన్ఫిడెంట్ లుక్‌తో, ఎలిగెంట్ స్టైల్‌తో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..

బేజ్ త్రీ-పీస్ పవర్ సూట్‌లో రాయల్ లుక్ :

తాజా ఫోటోషూట్ కోసం కియారా అద్వానీ వినూత్నమైన బేజ్ కలర్ త్రీ-పీస్ పవర్ సూట్‌ను ఎంచుకుంది. సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్, లోపల వి-నెక్‌తో ఉన్న బటన్-డౌన్ వేస్ట్‌కోట్, దానికి తగ్గట్టుగా ఉన్న వైడ్-లెగ్ ట్రౌజర్స్ ధరించి అత్యంత పవర్‌ఫుల్ బాస్ లేడీలా కనిపించింది. ఇక వైట్ కాలర్డ్ షర్ట్, స్లిమ్ టై, మ్యాచింగ్ హీల్స్ జత చేసి బోల్డ్ అండ్ క్లాసీ లుక్‌తో అదరగొట్టింది.

'పవర్ సూట్ ఎరా' అంటూ ఆసక్తికర క్యాప్షన్:

పాకెట్స్‌లో చేతులు పెట్టుకుని, పొడవాటి జుట్టును వదిలేసి కెమెరాకు కెవ్వుమనిపించే పోజులిచ్చిన కియారా, ఇన్స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ నోట్ షేర్ చేసింది. "ఒక్కటి ఎంచుకోలేకపోయాను, అందుకే 20 ఫోటోలు ఇక్కడ పెట్టేస్తున్నా.. నా పవర్ సూట్ ఎరాలో ఉన్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ లవ్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు అండ్ భారీ పారితోషికం:

సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్, జ్యువెల్లరీ, ఫిన్‌టెక్, లైఫ్‌స్టైల్ వంటి జాతీయ స్థాయి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కియారా భారీగా ఆర్జిస్తోంది. 'కబీర్ సింగ్', 'షేర్షా', 'భూల్ భులయ్యా 2' వంటి హిట్ల తర్వాత ఆమె మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగింది. ఇక సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫాలోయింగ్ కూడా ఆమె బ్రాండ్ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.

రామ్ చరణ్, యష్‌లతో పాన్ ఇండియా రేంజ్ :

కేవలం హిందీకే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనూ టాప్ హీరోలతో నటిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ చేంజర్', 'వార్ 2' చిత్రాల తర్వాత, ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీలో నాదియా గా నటించి మెప్పించారు.

స్టైలిష్ అవుట్‌ఫిట్లతో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, భారీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న కియారా అద్వానీ, రాబోయే రోజుల్లో వెండితెరపై మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.