కష్టకాలంలో తోడుగా సిద్ధార్థ్!
నిజ జీవితంలో కూడా బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా బాధ్యతలను నెరవేరుస్తున్నారని కియారా మాటలను బట్టి అర్థమవుతోంది.
By: Srikanth Kontham | 12 May 2026 10:45 AM ISTబాలీవుడ్ కపుల్స్ కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వృత్తిగత-వ్యక్తిగత జీవితాల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కియారా మామ్ అయినా? కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రధానత్య ఇస్తూనూ నటిగా ప్రయాణం సాగిస్తున్నారు. తాజాగా కియారా ప్రసవానంతర రోజుల్లో ఎదుర్కొన్న శారీరక మానసిక సవాళ్ల గురించి తొలిసారి ఓపెన్ అయ్యారు. క్లిష్ట సమయంలో భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తనకు అందించిన మద్దతు వెలకట్టలేనిదని ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. తల్లి కావడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి అయినా? ఆ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి చాలా మంది మహిళలను ఇబ్బంది పెడు తుంటాయి.
ఆ సమయంలో అనవసరమైన ఆందోళనలు, భయం ఆవహించినప్పుడు సిద్ధార్థ్ ఎంతో ఓపికగా తన వెంటే ఉండి ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు. భర్తగా కంటే మంచి స్నేహితుడిగా సిద్దార్ద్ తన భావాలను అర్థం చేసుకున్నాడని గుర్తు చేసుకున్నారు. తమ కుమార్తె సారాయా మల్హోత్రా పుట్టిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. కొత్త బాధ్యతలు, నిద్రలేని రాత్రులు వంటి అంశాలు తనను ఒత్తిడికి గురిచేసినా? సిద్ధార్థ్ ఇంటి పనుల్లో, పాప సంరక్షణలో చురుగ్గా పాల్గొనడం తో తనకు చాలా ఉపశమనం లభించిందన్నారు. సిద్ధార్థ్ వంటి భాగస్వామి పక్కన ఉండటం తన అదృష్టమని అతడు చూపించే చిన్న చిన్న జాగ్రత్తలు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని అమ్మడు కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కియారా మరో ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పారు. సమాజంలో ప్రసవానంతర నిరాశ గురించి చర్చలు చాలా తక్కువగా జరుగుతాయని దీనిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి మహిళకూ ఆ సమయంలో తన కుటుంబం , ముఖ్యంగా భర్త నుండి మానసిక మద్దతు చాలా అవసరమని అనుభవం ద్వారా వివరించారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను దాటడానికి సిద్ధార్థ్ తన చుట్టూ ఓ సానుకూల వాతావరణాన్ని సృష్టించారని కొనియాడారు. సిద్ధార్థ్ మల్హోత్రా తెరపైనే కాదు.
నిజ జీవితంలో కూడా బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా బాధ్యతలను నెరవేరుస్తున్నారని కియారా మాటలను బట్టి అర్థమవుతోంది. సెలబ్రిటీల జీవితం గ్లామరస్‌గా కనిపించినా? వారిలో కూడా సామాన్యుల తరహాలోనే భావోద్వేగ పోరాటాలుంటాయని ఈ జంట నిరూపిస్తోంది. భార్య క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ అండగా నిలిచిన తీరు నేటి తరం భర్తలందరికీ స్ఫూర్తిదాయకం. ఆ రకంగా కియారా - సిద్ధార్థ్ జంట తమ బంధంతో అందరికీ చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టాల్లో తోడుండటమే నిజమైన ప్రేమ అని చాటి చెబుతున్నారు. ప్రస్తుతం కియారా పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం కోసం అమ్మడు ఎతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
