Begin typing your search above and press return to search.

కియారా అద్వాణీ ఖాళీ అయిపోయిందే!

బాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో కియారా అద్వాణీ ఒకరు.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 5:00 AM IST
కియారా అద్వాణీ ఖాళీ అయిపోయిందే!
X

బాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో కియారా అద్వాణీ ఒకరు. అందం, అభినయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ ఒకప్పుడు బీజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న భామ ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కియారా చేతిలో ఎలాంటి కొత్త సినిమాలు లేకపోవడం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

కెరీర్ ప్రారంభం నుంచి హిందీతో పాటు దక్షిణాదిలోనూ భారీ అంచనాలున్న సినిమాల్లో కియారా భాగమైంది. అయితే ఆమె న‌టించిన పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. భారీ బడ్జెట్ తారాగణంతో తెరకెక్కిన సినిమాలు కూడా ప్లాప్‌గా నిలవడం కియారా మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించినా? ఆ చిత్రాల పరాజయం ఆమె కెరీర్ వేగానికి పెద్ద బ్రేక్‌గా మారింది.

ఈ నేప‌థ్యంలోనే అమ్మ‌డు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `టాక్సిక్` చిత్రం నుంచి ఎదురైన పరిణామాలు కూడా ఆమెకు గట్టి దెబ్బగా మారాయనే ప్ర‌చారం జోరందుకుంది. టాక్సిక్ ప‌రాజ‌యం కూడా కియారా కొత్త అవ‌కాశాల‌కు అడ్డంకింగా మారిందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టాక్సిక్ లో ఎంత మంది హీరోయిన్ల‌తో హీరో రొమాన్స్ చేసినా?

అందులో మెయిన్ లీడ్ మాత్రం కియారాదే. అయినా ఏం లాభం ఆ ప‌రాభ‌వం ప్ర‌తికూలంగా మారింది.

హిందీ, తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఏ భాషలోనూ కియారా కొత్త చిత్రాలకు సంతకం చేయకపోవడం అభిమా నులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు వరుస షూటింగ్‌లతో బిజీగా గడిపిన ముద్దుగుమ్మ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించకపోవడం అవకాశాల కొరతను స్పష్టంగా సూచిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కొత్త తరం కథానాయికల పోటీ పెరగడం కూడా దీనికి మరొక కారణంగా నిలుస్తోంది.

మరోవైపు పెళ్లి తర్వాత కెరీర్‌ను సమతుల్యం చేసుకునే క్రమంలో కథల ఎంపికలో కియారా మరింత జాగ్రత్త పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వరుస ప్లాప్‌లు పడటంతో పాటు పాన్ ఇండియా సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో మేకర్స్ కూడా ఆమెను భారీ ప్రాజెక్ట్‌లకు ఎంచుకోవడానికి పునరాలోచనలో పడ్డారనే గుసగుసలు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అనేప‌థ్యంలోనే కియారా కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో వెనుకంజ వేస్తుంద‌న్న‌ది మ‌రో వెర్ష‌న్.

ఏది ఏమైనా? పరిశ్రమలో జయాపజయాలు సర్వసాధారణం. ప్రస్తుతం సరైన ప్రాజెక్ట్ లేక విరామంలో ఉన్నట్లు కనిపిస్తున్నా? కియారా అద్వాణీకి ఉన్న క్రేజ్ , గ్లామర్ దృష్ట్యా బలమైన హిట్ పడితే మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది. మరి ఈ గ్యాప్ తర్వాత కియారా ఎలాంటి రీ-ఎంట్రీ ప్లాన్ చేస్తుందో? చూడాలి.