కియారా చెప్పేసింది కాస్కోండిక!
అలనాటి అందాల బాలీవుడ్ తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 3 Nov 2025 3:00 PM ISTఅలనాటి అందాల బాలీవుడ్ తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. సిద్దార్ద్ పి. మల్హోత్రా ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం స్టోరీ సహా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. అయితే మీనా కుమారి పాత్రలో బాలీవుడ్ నుంచి ఏ నటి రంగంలోకి దిగుతుంది? అన్నది ఇంత వరకూ సరైన స్పష్టత లేదు. తొలుత కృతి సనన్ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కియారా అద్వాణీ వెలుగులోకి వచ్చింది.
నేరుగా రంగంలోకి దిగిన కియారా:
కానీ అధికారికంగా ఎలాంటి కన్పర్మేషన్ లేకపోవడంతో నటి ఎవరు? అన్నది క్లారిటీ లేకుండా పోయింది. అటు మేకర్స్ గానీ..ఇటు నటీమణులు గానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా ఈ ప్రచారంపై కియారా పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. మీనా కుమారి పాత్రలో తానే నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. `కమల్ ఔర్ మీనా` టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మీనా కుమారి భర్త కమల్ పాత్ర ఏ నటుడు పోషిస్తారు? అన్నది ఆసక్తికరం. ఇంత వరకూ ఆ పాత్రకు సంబంధించి ఎంపిక కూడా పూర్తి కాలేదు.
ఆమె జీవితం తెరిచిన పుస్తకం:
కొంత మంది యువ నటుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ పని మనిహా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.అయితే ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా మిగతా పనులు కూడా పూర్తి చేయనున్నారు. ఒక్కసారి మీనా జీవితంలోకి వెళ్తే... బాలీవుడ్లో ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి కి పేరు గాంచారు. వృత్తి, వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటింది. నటిగా ఎన్నో క్లాసిక్ హిట్స్ తో తనకంటూ బాలీవుడ్ చరిత్రలో కొన్ని పేజీలు రాసిపెట్టారు.
జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన కారణాలు:
`సాహిబ్ బివి ఔర్ గులాం`, `దిల్ ఏక్ మందిర్`, `ఫూల్ ఔర్ పత్తర్`, `పకీజా` లాంటి చిత్రాలో అప్పట్లో మీనా కుమారి ఓ సంచలనం. సినిమాలు చేస్తున్నంత కాలం మీనా కుమారి బాలీవుడ్ లో ఓ మెరుపు. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం ఎంతో విషాధకరమైంది. ప్రేమ, నిరాశ, మద్యపానం అనే అంశాలు మీనా కుమారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసాయి. వృత్తి గత జీవితంలో ఎంత గొప్ప సక్సెస్ సాధించిందో వ్యక్తిగత జీవితంలో అంతకంతకు కోల్పోయింది.
