స్టన్నింగ్ లుక్.. క్రేజీ ఫోజ్.. టాక్సిక్ బ్యూటీ గ్లామర్ కి ఫ్యాన్స్ ఫిదా!
ఇక దీనికి కాంబినేషన్లో బాటమ్ గా అదే ఐవరీ కలర్ తో మ్యాక్సీ స్కర్ట్ డిజైన్ చేశారు. పైగా ఒక సైడ్ కి డీప్ కట్ తో డిజైన్ చేసిన ఈ స్కర్ట్ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ గా నిలిచింది.
By: Madhu Reddy | 9 Aug 2026 9:51 AM ISTగ్లామర్ కి సరికొత్త నిర్వచనం చూపిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ డ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతో అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె లేటెస్ట్ గ్లామర్ బ్యూటీగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తోంది కియారా అద్వానీ.
గ్లామర్ లుక్ లో కియారా అద్వానీ..
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. స్టన్నింగ్ లుక్ లో క్రేజీ ఫోజులతో కుర్రకారు గుండెల్లో గుణపాలు దించేసింది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ అవుట్ ఫిట్ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. కియారా ధరించిన డ్రెస్ విషయానికి వస్తే.. మాస్కోకి చెందిన సే నో మోర్ లేబోల్ నుండి చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఐవరీ కోఆర్డ్ ఎన్సెంబుల్ డ్రెస్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఆకట్టుకుంటున్న లేటెస్ట్ అవుట్ ఫిట్..
పెప్లమ్ ప్రిల్స్ తో నడుమ భాగంలో డిజైన్ చేసిన ఈ టాప్ భుజాల నుండీ కార్సెట్ జారుతున్నట్టు డిజైన్ చేసిన ఈ టాప్ చాలా ట్రెండీగా నిలిచింది. ఇక దీనికి కాంబినేషన్లో బాటమ్ గా అదే ఐవరీ కలర్ తో మ్యాక్సీ స్కర్ట్ డిజైన్ చేశారు. పైగా ఒక సైడ్ కి డీప్ కట్ తో డిజైన్ చేసిన ఈ స్కర్ట్ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ గా నిలిచింది. మొత్తానికైతే ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఈమె లుక్ మరింత అందంగా మారింది.
టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్..
కియారా అద్వానీ ప్రస్తుతం ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 8న బెంగళూరు వేదికగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కియారా అద్వానీ తన లేటెస్ట్ లుక్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.. ఇకపోతే టాక్సిక్ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఇందులో కియారా నదియా అనే పాత్ర పోషిస్తుండగా.. పైగా ఈ పాత్ర కోసం రూ.10 నుండి రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో కియారా అద్వానీ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయం అనే కామెంట్ వినిపిస్తూ ఉండడం గమనార్హం.
కియారా అద్వానీ తెలుగు చిత్రాలు..
మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కియారా. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత గత ఏడాది మళ్లీ రాంచరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేసింది కానీ ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది.
