Begin typing your search above and press return to search.

డర్టీ పబ్లిక్ స్టంట్.. ఖుషీ ముఖర్జీపై విమర్శలు!

తాజాగా బ్లాక్ ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించిన ఈమె అసభ్యంగా కనిపించేలా ఆ దుస్తులు వేసుకొని ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

By:  Madhu Reddy   |   11 Oct 2025 4:36 PM IST
డర్టీ పబ్లిక్ స్టంట్.. ఖుషీ ముఖర్జీపై విమర్శలు!
X

సినిమా అంటే ఒకప్పుడు రంగుల ప్రపంచం అని పిలవబడేది.. కానీ ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలా మారిపోయింది. ఈ గ్లామర్ ప్రపంచంలో నెట్టుకు రావాలి అంటే ఎలాంటి వారైనా సరే అందాల ప్రదర్శన చేయాల్సిందే అనే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించిన చాలామంది భామలు ఇప్పుడు గ్లామర్ వలకబోస్తూ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. నిజానికి ఈ గ్లామర్ ప్రపంచంలో నటనతో కూడా అబ్బురపరిస్తున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. కానీ చాలామంది మాత్రం ఇలా గ్లామర్ తోనే ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమాలలోనే కాదు పబ్లిక్ లో తిరుగుతూ చిట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ షోతో అప్పుడప్పుడు పబ్లిక్ తో చివాట్లు కూడా పడుతుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఖుషి ముఖర్జీ కూడా వచ్చి చేరింది. తెలుగులో సినిమాలు చేసినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోని ఈమె.. బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలు. నిత్యం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈమె.. ఈ మధ్య క్లీవేజ్ షోతో పబ్లిక్ లో కూడా తిరుగుతూ కెమెరాలకు కునుకు లేకుండా చేస్తోంది.

ఉర్ఫీజావేద్ ఎలా అయితే తమ వేషధారణతో ఫేమస్ అయ్యారో ఇప్పుడు ఖుషీ ముఖర్జీ కూడా పబ్లిక్ లో అందాలను చూపిస్తూ.. తన వస్త్రధారణతో తానే ఇబ్బందులు పడుతూ విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. మొన్నటి వరకు పలు రకాల దుస్తులతో సందడి చేసిన ఈమె.. తాజాగా మరో ఔట్పిట్టతో పబ్లిక్ లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా బ్లాక్ ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించిన ఈమె అసభ్యంగా కనిపించేలా ఆ దుస్తులు వేసుకొని ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇలాంటి వస్త్రధారణతో పబ్లిక్ లో కనిపించడంతో డర్టీ పబ్లిక్ స్టంట్ అంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలివితేటలను ప్రదర్శించి ఉత్తమ నటిగా గుర్తింపు పొందాలి కానీ ఇలాంటి డర్టీ పబ్లిక్ స్టంట్ ల వల్ల ఎవరికి ఉపయోగం.. ముఖ్యంగా ఇలాంటి వాళ్ల వల్ల సభ్య సమాజం ఎటుపోతోంది అంటూ ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఖుషి ముఖర్జీ చేసిన ఈ పబ్లిక్ స్టంట్ కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఖుషీ ముఖర్జీ విషయానికి వస్తే.. 1996 నవంబర్ 24న జన్మించిన ఈమె వయసు 28 ఏళ్ళు. చిన్న వయసులోనే మోడల్ గా కెరియర్ ను ప్రారంభించింది. అలా కాస్త గుర్తింపు దక్కించుకున్న ఈమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ.. సీరియల్స్ తో టీవీ షో లతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది ఖుషీ ముఖర్జీ. అలా నటనతో మంచి పేరు సొంతం చేసుకోకుండా ఇలా డర్టీ పబ్లిక్ స్టంట్ చేస్తూ విమర్శలు ఎదుర్కోవడంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.