దుకాణం ముందు టపాకాయలా పేలిన అందాల యూట్యూబర్
టపాకాయల బేరం సరిగా తేలలేదో ఏమో కానీ, ఇక్కడ అందాల యూట్యూబర్ షాప్ యజమానిపై రుసరుసలాడిపోతోంది.
By: Sivaji Kontham | 23 Oct 2025 8:46 PM ISTటపాకాయల బేరం సరిగా తేలలేదో ఏమో కానీ, ఇక్కడ అందాల యూట్యూబర్ షాప్ యజమానిపై రుసరుసలాడిపోతోంది. తన చేతికి దొరికిన టపాకాయలను దూరంగా విసిరేసి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ సన్నివేశంలో బ్యూటిఫుల్ యూట్యూబర్ కనీసం ఒంటిపై ఆచ్ఛాదన అయినా ఉందో లేదో గుర్తు చేసుకోలేని స్థితి. ఆదమరిచి పవిట కొంగును కూడా జారవిడిచింది. చూస్తుంటే ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా? అని కొందరు కంగారు పడిపోయారు కానీ అక్కడ జరుగుతున్న వాగ్వాదాన్ని బట్టి కచ్ఛితంగా ఇది నిజం గొడవేనని ధృవీకరించాలి.
దీపావళికి ముందు ఇలా స్థానికంగా రోడ్ పక్కన దుకాణం వద్ద ఇలాంటి రగడ సృష్టించింది సదరు యూట్యూబర్. ఆమె పేరు ఖుషి ముఖర్జీ. అలా దుకాణంలోంచి అనుమతి లేకుండా లాక్కుని, టపాకాయలు విసిరేస్తుంటే, అవి ఎక్కడైనా నిప్పులో పడి ఫైరైతే పరిస్థితి వేరేగా ఉండేదని కూడా అక్కడి వారు ఆందోళన చెందారు. పరిసరాల్లోని దుకాణ దారులంతా ఆవిడ ప్రవర్తనకు చాలా కంగారు పడిపోతున్న దృశ్యం కనిపించింది. అయితే టపాసులు అలా విసిరేస్తుంటే, దుకాణదారు ఆమె ప్రవర్తన సరికాదని హెచ్చరించాడు. నిన్ను నాలుగు తన్నిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతాను! అంటూ హెచ్చరించాడు. కానీ యూట్యూబర్ ఎక్కడా తగ్గేదేలే అంటూ చెలరేగిపోతోంది.
చుట్టూ ఉన్నవాళ్లు ఏంటి ఈ రచ్చ అమ్మడూ? అని వినోదం చూడటంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది. అయితే ఇదంతా చూస్తున్న వారికి ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనా? ఆవిడ మరీ ఇంత చెత్తగా ప్లాన్ చేసిందేమిటీ? ప్రమాదంతో ఆటలు ఆడుతోందా? అంటూ కొందరు నిలదీసే ప్రయత్నం చేసారు. దీపావళి క్రాకర్స్ తో వెటకారాలా? ఇలాంటి పబ్లిసిటీతో సాధించేదేమిటో చెప్పాలని కూడా కొందరు అడుగుతున్నారు. ఆమె అలా చేయాల్సింది కాదని, కంటెంట్ కోసం ఇలాంటి పనులు చేయకూడదని చాలామంది సూచించారు.
తనదైన ఎనర్జీ బోల్డ్ నెస్ తో ఆకర్షించే ఖుషి ముఖర్జీ ఇంకా దీనిపై స్పందించలేదు. కానీ పబ్లిక్ ప్లేసుల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోకుండా ఇలా చేయడం సరికాదని చాలామంది నెటిజనులు సూచించారు.
