Begin typing your search above and press return to search.

నటిపై పరువునష్టం దావా.. ఏకంగా రూ.100 కోట్ల షాక్!

టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ పై నటి ఖుషీ ముఖర్జీ గతంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   16 Jan 2026 5:00 PM IST
నటిపై పరువునష్టం దావా.. ఏకంగా రూ.100 కోట్ల షాక్!
X

టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ పై నటి ఖుషీ ముఖర్జీ గతంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఓ మీడియా ఈవెంట్‌ లో మాట్లాడిన ఖుషీ, సూర్యకుమార్ యాదవ్ గతంలో తనకు తరచూ మెసేజ్‌ లు చేసేవాడని చెప్పడంతో క్రికెట్ అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యారు.

ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయిన ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ.. నటి ఖుషీ ముఖర్జీపై పరువు నష్టం దావా వేశారు. జనవరి 13న ఘాజీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫైజాన్, రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు నమోదు చేయాలని కోరారు. అంతే కాదు.. కేసు నమోదు కోసం ఆయన ముంబై నుంచి స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ కు వెళ్లడం గమనార్హం.

ఫైజాన్ అన్సారీ మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ లెవెల్ లో దేశానికి కీర్తి తెస్తున్న ఓ క్రికెటర్ ఇమేజ్ ను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు. పబ్లిసిటీ కోసం, సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుషీపై కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే ఇప్పటికే తన కామెంట్స్ పై ఖుషీ ముఖర్జీ రెస్పాండ్ అయ్యారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. "సూర్యకుమార్ యాదవ్‌ తో నా మధ్య ఏమీ లేదు. మేం కేవలం స్నేహితులం మాత్రమే. ఒక సందర్భంలో అతడు మ్యాచ్ ఓడిపోయినప్పుడు బాధపడ్డాడు. అప్పుడు ఫ్రెండ్లీగా మెసేజ్‌ లు చేసుకున్నాం. అంతకు మించి ఏ సంబంధం లేదు" అని ఖుషీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తనను ఎవరితోనైనా లింక్ చేసి మాట్లాడటం తనకు అస్సలు నచ్చదని ఆమె పేర్కొన్నారు. "నేను ఏ క్రికెటర్‌ తోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదు. సూర్య నాకు మంచి స్నేహితుడు మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు. కానీ నెటిజన్లలో చాలామంది ఈ వివరణను కూడా పబ్లిసిటీ స్టంట్‌ గా భావించారు. మొత్తానికి ఒక్క కామెంట్ తో మొదలైన వ్యవహారం ఇప్పుడు చట్టపరమైన వివాదంగా మారింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఖుషీ ముఖర్జీ విషయానికొస్తే,. కోల్‌ కతాలో జన్మించిన ఆమె ఎంటీవీ ప్రసారం చేసిన స్ప్లిట్స్‌ విల్లా రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. లవ్ స్కూల్ 3లో కంటెస్టెంట్‌ గా పాల్గొన్నారు. బాలీవుడ్‌ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా ఖుషీ నటించారు. హార్ట్ ఎటాక్, దొంగ ప్రేమ, గుర్రం పాపిరెడ్డి, శృంగారం, మారియో వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వివిధ సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు సూర్య కామెంట్స్ వ్యవహారంలో ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి.