కుమార్తె కోసం నిర్మాత ట్రయల్స్!
ఓ స్టారో కోసం, అగ్ర బ్యానర్లో లాంచింగ్ కోసం బోనీ పావులు కదుపుతున్నారుట. టాలీవుడ్ లో తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓఒ రెండు..మూడు బ్యానర్లను అప్రోచ్ అయ్యారుట.
By: Srikanth Kontham | 10 Sept 2025 1:00 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి-బోనీ కపూర్ ల రెండవ కుమార్తె ఖుషీ కపూర్ బాలీవుడ్ డెబ్యూ ఇప్పటికే పూర్త్యింది. 'లవ్ యాపా', 'నాదాన్ నియాన్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ రెండు ఖుషీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. సాధారణ చిత్రాలగానే మిగిలిపోయాయి. `ధడక్` తో జాన్వీ కపూర్ కి దక్కిన గుర్తింపు కూడా ఈ రెండు చిత్రాలతో ఖుషీ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో `మామ్ 2` చిత్రంలో నటిస్తోంది. ఈనేపథ్యంలో బోనీ కపూర్ టాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
ఓ స్టారో కోసం, అగ్ర బ్యానర్లో లాంచింగ్ కోసం బోనీ పావులు కదుపుతున్నారుట. టాలీవుడ్ లో తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓఒ రెండు..మూడు బ్యానర్లను అప్రోచ్ అయ్యారుట. ఆ బ్యానర్ల నుంచి కూడా సానుకూలంగానే స్పందన వచ్చిందని తెలిసింది. హీరో కూడా సెట్ అయితే ముందుకెళ్దామని మాటిచ్చా రుట. కానీ ఖుషీ ఉన్న ఫేజ్ లో స్టార్ హీరోలతో అవకాశాలు కష్టమే. టైర్ 2, టైర్ 3 హీరోలకు ముందుకొచ్చే అవకాశం ఉంది. స్టార్స్ తో పని చేయాలంటే? ఖుషీ కపూర్ టాలీవుడ్ లో సక్సెస్ అయితేనే పనవుతుంది.
ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ రే టాలీవుడ్ లో కిందా మీదా పడి సినిమాలు చేస్తోంది. `దేవర` ఫలితం అమ్మ డిని నిరాశకు గురించి చేసింది. లక్కీగా `పెద్ది` సినిమాకుర బుచ్చిబాబు తీసుకున్నాడు కాబట్టి సరి పోయింది? లేదంటే జాన్వీ కి అవకాశం కష్టమయ్యేది. తుదుపరి జాన్వీ కొనసాగాలన్నా? `పెద్ది` సక్సెస్ అయితేనే. లేదంటే కొత్త అవకాశాలు కష్టమేనన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఇలాంటి సమయంలో? ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్ లాంచింగ్ ప్రయత్నాలు చేయడం ఆసక్తికరం. మరి ఈ బ్యూటీ టైమ్ ఎలా ఉందన్నది చూడాలి.
తండ్రిగా బోనీ కపూర్ మాత్రం తాను చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లతో బోనీకి మంచి స్నేహం ఉంది. మరి ఆ పరిచయాలు కూడా వాడుతున్నారా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఖుషీ కపూర్ `మామ్ 2`లో నటిస్తోంది. ఈసినిమా కూడా శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన `మామ్` కి సీక్వెల్. బాలీవుడ్ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. `మామ్` నిర్మాతల్లో బోనీ కపూర్ కూడా ఒకరు. ఈ నేప్యథ్యంలో కుమార్తె ను కూడా ఈ సీక్వెల్ లోకి తీసుకున్నారు.
