Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

ఖుషీ కపూర్ తన లేటెస్ట్ రెడ్ డిజైనర్ దుస్తుల ఫొటోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఆమె మోడల్ తరహా లుక్‌ను చూసి నెటిజన్లు కెండాల్ జెన్నర్‌తో పోలుస్తున్నారు. మరోవైపు శ్రీదేవి పోలికలు కనిపిస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఖుషీ ‘మామ్ 2’ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By:  Sivaji Kontham   |   15 Nov 2026 8:00 AM IST
జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీక‌పూర్ ఇప్ప‌టికే ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతుండ‌గా, త‌న సోద‌రితో పోటీప‌డుతూ ఖుషీ కూడా చెల‌రేగిపోతోంది. యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన లేటెస్ట్ గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. రెడ్ కలర్ డిజైన‌ర్ దుస్తుల్లో స్టన్నింగ్‌గా కనిపిస్తూ త‌న ఎంపిక‌లు యూనిక్ అని మరోసారి నిరూపించుకుంది. ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపట్లోనే నెట్టింట వైరల్ కాగా.. ఖుషి కాన్ఫిడెన్స్, గ్రేస్‌కు అభిమానులు- ఫ్యాషన్ ప్రియులు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఖుషీ కపూర్ మోడల్ తరహా స్టైలింగ్ చూసి నెటిజన్లు ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ కెండాల్ జెన్నర్‌తో పోలుస్తూ `మేడ్ ఫర్ ది రన్‌వే` అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బార్బీ డాల్, స్టార్ గర్ల్ అంటూ కామెంట్ల‌తోను కొంద‌రు రెచ్చిపోతుండ‌గా.. మరికొందరు మాత్రం దివంగత లెజెండరీ నటి శ్రీదేవి పోలికలు అచ్చం అలాగే ఉన్నాయంటూ ఎమోషనల్ అవుతున్నారు. అయితే అరుదుగా కొంద‌రు మాత్రం ఖుషీ ఫ్యాష‌న్ ఫెయిలైందంటూ నెగెటివ్ వ్యాఖ్య‌లు చేసారు.

కేవలం ఫ్యాషన్ పరంగానే కాకుండా... ఖుషీ కపూర్ తదుపరి సినిమాలపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రం `మామ్`కు సీక్వెల్‌గా.. గిరీష్ కోహ్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మామ్ 2` టీజర్ ఎప్పుడు వస్తుందంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. గ్లామ‌ర్ షోలు స‌రే.. సినిమాల‌తో మంచి హిట్లు కొట్టాల‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

ఖుషీ గ‌త కెరీర్ ని ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల అమీర్ ఖాన్ వార‌సుడి స‌ర‌స‌న న‌టించిన సినిమా కూడా ఫ్లాపైంది. అంత‌కుముందు ది ఆర్చీస్ తో తెరంగేట్రం చేసినా ఆశించిన గుర్తింపు రాలేదు. నిజానికి జాన్వీ, ఖుషీ లాంటి న‌ట‌వార‌సురాళ్ల‌ను మించి అనీత్ ప‌ద్దా లాంటి ఔట్ సైడ‌ర్ కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తీవ్ర‌మైన పోటీ న‌డుమ ఖుషీ ఇటీవ‌ల మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో స‌రిపెడుతూ.. న‌టిగా వెంట వెంట‌నే సంత‌కాలు చేయ‌డంలో వెన‌క‌బడింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.